ETV Bharat / state

ప్రయాణికులకు బిగ్​ షాక్ - హైదరాబాద్​ మెట్రో రైలు సేవల్లో అంతరాయం!

మెట్రో రైలు విద్యుత్​ ఛానల్​లో తలెత్తిన సమస్య - పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ - అరగంట పాటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది

HYDERABAD METRO SERVICE
METRO DISRUPTED FEW MINUTES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2024, 3:28 PM IST

Hyderabad Metro Disrupted Few Minutes : హైదరాబాద్‌లోని మెట్రో రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ (రెడ్​ లైన్​) వరకు వెళ్లే మెట్రో రైలు మార్గంలో సాంకేతిక సమస్య ఉత్పన్నం కావడంతో చైతన్యపురి మెట్రో స్టేషన్‌లో కొన్ని నిమిషాలపాటు ఓ మెట్రో రైలు నిలిచిపోయింది. ఈ క్రమంలో మూడు నాలుగు నిమిషాల ఆలస్యం కారణంగా అన్ని మెట్రో స్టేషన్లలో కొద్ది క్షణాల్లోనే ప్రయాణికుల రద్దీ పెరిగింది.

విద్యుత్​ ఫీడర్​లో సమస్య : ప్రయాణికుల రద్దీతో అమీర్‌పేట జంక్షన్​ స్టేషన్‌లో ఫ్లాట్‌ ఫామ్​ కిటకిటలాడింది. రైలు కోసం వేచి చూస్తుండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ఫీడర్ ఛానల్​లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు మెట్రో సిబ్బంది తెలిపారు. కొద్ది సమయం పాటు తక్కువ వేగంతో మెట్రో రైళ్లను నడిపారు. ఎల్‌బీనగర్- మియాపూర్ మార్గంలో మెట్రో రైళ్ల ఆలస్యం కారణంగా ప్రతి మెట్రో స్టేషన్‌ వద్ద కూడా రద్దీ పెరిగి ప్రయాణికులు అసౌర్యానికి గురయ్యారు.

దాదాపు అరగంట పాటు ఈ అసౌకర్యం, సాంకేతిక సమస్య ప్రభావం కనిపించింది. మెట్రో సిబ్బంది అనౌన్స్​మెంట్​ ఇస్తూ ప్రియమైన ప్రయాణీకులారా సాంకేతిక లోపం కారణంగా ఈ ఉదయం బ్లూ లైన్‌లో నడిచే రైళ్లలో స్వల్ప ఆలస్యమైందని... ఇప్పుడు సర్వీసులు పునరుద్ధరించబడ్డాయని వెల్లడించారు. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం... మీ సహకారానికి ధన్యవాదాలు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. అరగంట తర్వాత సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా మెట్రో రైళ్లు నడిచాయి.

మెట్రోకు ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. రోజు రోజుకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. గతంలో 50 కోట్ల మంది ప్రయాణించి మైలురాయిని మెట్రో చేరుకుందని ఎండీ ఎన్వీఎస్​ఎస్​ రెడ్డి తెలిపారు. కాగా హైదరాబాద్​ మెట్రో రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 నవంబరు 29 న ప్రారంభించారు. మెట్రోను శంషాబాద్​ విమానాశ్రయం వరకు పొడగించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెట్రోలో ప్రయాణికులు కాలుష్యం లేకుండా త్వరగా గమ్యస్థానాలు చేరుతుండడంతో మంచి ఆదరణ దక్కుతోంది. నగర వ్యాప్తంగా మెట్రో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

సిటీ మొత్తం మెట్రో పరుగులు! - రెండో దశ నిర్మాణానికి సర్కార్ పరిపాలనా అనుమతులు

ప్రయాణికులకు మెట్రో గుడ్​న్యూస్​ - ఆ ఆఫర్లు 2025 వరకు పొడిగింపు - Hyderabad metro train offers extend

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.