Hyderabad Metro Rail New Record With 50 Crore Passengers : దేశంలో మూడవ పొడవైన కార్యాచరణ మెట్రో నెట్‌వర్క్‌గా పేరుపొందిన హైదరాబాద్ మెట్రో రైలుతో ప్రయాణికుల అనుబంధం కొనసాగుతూనే ఉంది. మెట్రో రైలు ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు ఆరున్నరేళ్లలో 50 కోట్ల మంది ప్రయాణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో పాటు ప్రతి రోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో గమ్యస్థానానికి చేరుకుంటున్నారని తెలిపింది. ఈ సందర్భంగా కస్టమర్, గ్రీన్‌మైల్ లాయల్టీ క్లబ్‌ను ఇవాళ ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రారంభించనుంది.
Hyderabad Metro Rail History : హైదరాబాద్‌లో మెట్రో రైలును 2017 నవంబరు 29న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మొదటిగా మియాపూర్ నుంచి అమీర్‌పేట- నాగోల్ మార్గంలో సేవలను మొదలయ్యాయి.ఆ తరవాత 5 దశల్లో పూర్తిగా 69.2 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. కారిడార్-1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో రెండున్నర లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. ఇదే స్థాయిలో కారిడార్-3 నాగోల్ నుంచి రాయదుర్గంలో రద్దీ ఉంటుంది.
Hyderabad Metro Green Line Full Details : హైదరాబాద్ మెట్రో గ్రీన్ లైన్.. ఈ విషయాలు తెలుసా..?
కారిడార్ -2 జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు సగం మాత్రమే అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉంది. నిత్యం ప్రయాణిస్తున్న 5 లక్షల మందిలో ఐటీ ఉద్యోగులే 1.50 లక్షల వరకు ఉన్నారని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులు 1.20 లక్షల వరకు రాకపోకలు కొనసాగిస్తున్నారని తెలిపాయి. 2023 జులైలో 40 కోట్లు చేరుకున్న సంస్థ 9 నెలలులోనే మరో 10 కోట్ల మందిని ప్రయాణించడం విశేషం.
Green Loyalty Club Will Start by Hyderabad Metro : తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోన్న మెట్రో రైలు సంస్థ ప్రజల్లో మంచి ఆదరణ పొందింది. అందువల్ల ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో మెట్రో రైళ్లు సరిపోక ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సరిపడా మెట్రో రైళ్లు లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అద్దెకైనా తీసుకుని నడపాలని ఆదేశించింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు మేరకు నడుచుకునే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి ఈ విషయంలో తదుపరి కార్యచరణపై స్పష్టత రానుంది.
Hyderabad Metro Passes For Students : స్టూడెంట్స్ పాస్ ప్రవేశపెట్టిన మెట్రో.. ఎప్పుడు నుంచో తెలుసా?