ETV Bharat / state

ఇకపై జీహెచ్‌ఎంసీ కాదు - హైదరాబాద్ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌! - CM Revanth Reddy on GHMC

Hyderabad Greater City Corporation : జీహెచ్‌ఎంసీని గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్​గా మార్చేలా రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు చేస్తోంది. సమాన జనాభా ఉండేలా డివిజన్లను పునర్విభజన చేయాలని భావిస్తోంది. ఆ విషయంపై అధ్యయనం చేయాలని మున్సిపల్‌ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 7:21 AM IST

హైదరాబాద్ పరిధిలోని ఏడు కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తు

Hyderabad Greater City Corporation : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా ఆవిష్కరించేందుకు తెలంగాణ సర్కార్ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందేకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో విలీనంపై కసరత్తు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు.

Telangana Govt Plans to Merger Corporations and Municipalities : విలీనం చేస్తే ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 150 డివిజన్లు ఉంటే జనాభా కోటికిపైగా ఉంది. ఏడు కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా. ఒకవేళ విలీనం చేస్తే 1.80 కోట్ల నుంచి 2 కోట్లకు జనాభా చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన ప్రాంతాలన్నింటిని గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌గా ఒకటిగా ఏర్పాటు చేయాలా? లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం వేర్వేరుగా నాలుగు సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలిచ్చారు.

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

ఏడాది తర్వాతే ప్రత్యేకాధికారులు! : ప్రాంతీయ రింగు రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్‌ హైదరాబాద్‌ (GHMC) శివారు మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే పత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

ఏకరూప అభివృద్ధి : ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికిపైగా జనాభా ఉంటే, మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో 30,000ల మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఉంది. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే రీతిలో కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, ప్రత్యేక పాఠశాలలు : సీఎం రేవంత్​రెడ్డి

నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని ఆ విషయంపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు సంవత్సరాల కిందట దేశ రాజధాని దిల్లీలో అక్కడి మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. ఇందుకు అనుసరించిన విధానాల గురించి మున్సిపల్ అధికారులను రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్

'ప్రపంచంతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం - గత పాలకుల మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.