Pollution Increasing Vehicles in Hyderabad : నగరాలు అర్బన్ హీట్ ఐలాండ్స్‌గా మారాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగర పరిసరాల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో 44.5 డిగ్రీల వరకు వెళ్లాయి. ఇందుకు వాహనాల సంఖ్య పెరగడం కూడా ఓ కారణం. వీటి నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి.
Hyderabad People Can be Using Metro to Reduce Heat : ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు నిత్యం అత్యంత రద్దీగా ఉండే మార్గంలో గంటకు 22,000ల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో అత్యధికం ద్విచక్రవాహనాలే. ఇటీవల కార్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి నిత్యం 65,000ల కిలోల కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి వదులుతున్నాయి. హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఎక్కువ వాహన సాంద్రత ఉన్న రెండో నగరంగా ఉంది. పరిసరాలు వేడెక్కడానికి వాహన కాలుష్యమూ కారణమే. పర్యావరణహిత ప్రజారవాణాను నగరంలో పెంచడమే ఇందుకు పరిష్కారమని రవాణా, పర్యావరణ రంగ నిపుణులు అంటున్నారు.
రోజూ 25 వేల కిలోమీటర్ల రాకపోకలు : హైదరాబాద్‌లోని మూడు కారిడార్లలో 69 కిలో మీటర్ల మేర మెట్రో పరుగులు తీస్తోంది. ప్రతిరోజూ 25,000ల కిలోమీటర్లు నడుస్తోంది. సగటున ప్రతిరోజూ 5 లక్షల మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. వీరు వాహనాలను మెట్రో స్టేషన్ల వద్ద నిలిపి, మెట్రోలో వెళ్లి, తిరిగి వస్తున్నారు. వీరంతా తమ వ్యక్తిగత వాహనాలకు దూరంగా ఉండటం వల్ల నిత్యం 10 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు తగ్గాయి.
వాస్తవానికి మొదటి విడత మెట్రోను 15 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా రూపొందించారు. దీనికి ఇంకా ఆదరణ పెరగాల్సి ఉంది. ఈ సంవత్సరం ఆఖరు నాటికి ప్రతిరోజూ మెట్రోలో సగటు ప్రయాణికుల సంఖ్య 6 లక్షలకు చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందులో ఎల్ అండ్ టీ మెట్రో లక్ష్యమే కాదు, సామాజిక అంశమూ ముడిపడి ఉంది కాబట్టే వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు.
రెండో విడతలోనూ : మెట్రోరైలు రెండో విడతలో 70 కిలో మీటర్ల విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తై పరుగులు పెడితే మరో 10 లక్షల కిలోల కర్బన ఉద్గారాలు హైదరాబాద్‌లో కలవకుండా ఉంటాయి. వీటిని త్వరిగతగతిన పూర్తి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇలా చేస్తే ఇంకా మేలు : అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రభావం తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ దేశంలోనే మొదటిసారిగా కూల్‌రూఫ్ (ఇంటిపై పెయింటింగ్) పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని ఇళ్లపై కూల్‌రూఫ్స్ ఉంటే ఇంట్లో చల్లగా ఉండటమే కాదు అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.
తీవ్రమవుతోన్న ట్రాఫిక్ సమస్య.. కూడళ్ల విస్తరణకు మోక్షమేది..?