ETV Bharat / state

భార్యపై అనుమానం - గొడ్డలితో నరికి చంపిన భర్త - husband killed his wife - HUSBAND KILLED HIS WIFE

Husband Was Killed Wife With Axe: అనుమానం ఎంతటి బంధాన్ని అయిన దూరం చేస్తుందనటానికి ఈ సంఘటనే నిదర్శనం. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. మద్యం సేవించి ఉన్న భర్త ఉదయం గొడవపడి కోపంతో ఆమెపై దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Husband Was Killed Wife With Axe
Husband Was Killed Wife With Axe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 1:53 PM IST

Husband Was Killed Wife With Axe in Bapatla District : వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను గొడ్డలితో దారుణంగా నరికి చంపిన ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కారణంగా తరచూ గొడవలు జరుగుతుండటంతో మద్యం సేవించి ఉన్న భర్త ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే: నిజాంపట్నం మండలంలో నక్షత్ర నగర్ గ్రామానికి చెందిన వెెంకటేశ్వరరావు, శివలక్ష్మి అనే దంపతులకు పది సంత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం మొదలైంది. దీంతో తెల్లవారు జామున భర్త వెంకటేశ్వరరావు మరోసారి ఆమెతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు గొడ్డలితో భార్య శివలక్ష్మిపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

బాపట్ల జిల్లాలో దారుణం - యువతి హత్యాచార ఘటనపై సీఎం సీరియస్ - Woman raped in Bapatla district

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు ఆమెను హత్య చేశాడు అని స్థానికులను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అక్కడి నుంచి పోలీసులు రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానమే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలికి నాని (8), నాగజ్యోతి (6) ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కడప వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి హత్య కేసు రీఓపెన్ - పలువురు నేతల్లో ఆందోళన - SRINIVAS REDDY MURDER CASe to cid

కుమార్తె వెంట పడొద్దన్నందుకు వ్యాపారి దారుణ హత్య - విజయవాడలో నడిరోడ్డుపై కత్తితో యువకుడి దాడి - Vijayawada Kirana Shop Owner Murder

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.