ETV Bharat / state

ఎంత పని చేశావే రూపాయి - రూ.5000ల కోసం భార్యను చంపిన భర్త - HUSBAND KILLED WIFE IN VIJAYAWADA

విజయవాడలో భార్యను దారుణంగా హతమార్చిన భర్త

Husband Killed Wife in Vijayawada
Husband Killed Wife in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 10:25 AM IST

A Man killed Wife in Vijayawada : డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అంటే ప్రాణ మిత్రుల్ని విడగొడతాను. తండ్రీకుమారుల మధ్య చిచ్చు పెడతాను. మనుషులు విచక్షణ కోల్పోయేలా చేసి బంధాలు తెంచేస్తానని చెబుతుంది అనేది ఓ సినిమాలోని డైలాగ్. ఈ ఘటన చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. డబ్బుల విషయంలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఈ దారుణ ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది.

డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో భార్య పీక కోసి హతమార్చాడు ఓ భర్త. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ కంసాలిపేటకు చెందిన షేక్‌ బాజీ, నగీన(32)లకు 11 సంవత్సరాల కిందట వివాహమైంది. వారికి ఓ కుమారుడు. భర్త పెయింటింగ్‌ పని చేస్తుండగా, భార్య స్థానికంగా సమోసాల తయారీ కేంద్రంలో పని చేస్తుంది. షేక్ బాజీ మద్యానికి బానిసై పనికి సరిగా వెళ్లేవాడు కాదు. తరచూ అప్పులు చేస్తూ భార్యను డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగాడు.

ఇలా షేక్ బాజీ స్పిరిట్, సొల్యూషన్‌ తాగేందుకు అలవాటు పడ్డాడు. నాలుగు రోజుల కిందట రూ.5,000 కావాలని భార్యను అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఘర్షణకు దిగాడు. ఆ తర్వాత నగీన పక్కవీధిలో ఉండే అక్క సాబీర దగ్గరకు వెళ్లింది. సాయంత్రం పని అయిపోగానే ఇంటికి వెళ్లి రాత్రి పూట నిద్రించేందుకు అక్క దగ్గరకు వస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 21న తెల్లవారుజామున 4 గంటలకు పనికి వెళ్లిన నగీన ఓ గంట విశ్రాంతి సమయం ఉండడంతో ఉదయం 8 గంటలకు ఇంటికి వచ్చింది.

A Man killed Wife in Vijayawada
మృతురాలు నగీన (ETV Bharat)

Husband Killed Wife in Vijayawada : అప్పటికే మత్తులో ఉన్న షేక్ బాజీ నగీనతో గొడవపడి కొట్టాడు. దీంతో ఆమె తన సోదరికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని తెలిపింది. ఇంతలోనే ఉల్లిపాయలు కోసే కత్తితో అతను భార్య పీక కోశాడు. నగీన కేకలు వేస్తూ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మరణించింది. సాబీర తన చెల్లి ఇంటికి వచ్చే చూసే సరికి కత్తితో రక్తం మరకలతో బాజీ బయటకు వస్తున్నాడు. ఆమె ఆందోళనతో ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో విగతజీవురాలైన నగీన కనిపించింది.

సాబీర కేకలు వేయడంతో చుట్టు పక్కల వాళ్లు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు బాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. సాబీర సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకునన్నామని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మృతురాలి అక్క ఫిర్యాదు మేరకు బాజీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని కొత్తపేట పోలీసులు వివరించారు.

విశాఖ జిల్లాలో దారుణం - అనుమానంతో భార్యను చంపిన భర్త

భార్య, కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య- ఏం జరిగిందంటే? - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.