Huge Scams in Hyderabad in The Name of Real Estate : హైదరాబాద్‌కు చెందిన దంపతులు ప్రభుత్వోద్యోగులుగా పని చేశారు. ఉన్నత హోదాలో రిటైర్ అయ్యారు. ఓ స్థిరాస్తి వ్యాపారిని నమ్మి చేతికివచ్చిన రూ.5 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. తక్కువ ధరకు స్థలం అమ్ముతున్నారంటే ఏదో మర్మం ఉందని తెలిసి కూడా సొమ్మంత పెట్టేశారు. మోసపోయామని గ్రహించి న్యాయం చేయమంటూ బాధితులు నగర సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
ప్రీలాంచింగ్ పేరిట ప్రకటనకు ఆకర్షితులై : ఈ ఏడాది 8 నెలల వ్యవధిలో 200కు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ.250-300 కోట్ల వరకూ నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. 30 ఏళ్ల పాటు దాచిన సంపాదనను మూడు రోజుల్లో పోగొట్టుకున్న బాధితులున్నారు. ఈ మధ్యకాలంలో ప్రీ లాంచింగ్ పేరిట స్థిరాస్తి సంస్థల ప్రకటనలతో ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నకిలీ పత్రాలతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను నమ్మించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అలాగే స్థలాలకు రాబోయే కాలంలో బాగా డిమాండ్ వస్తుందంటూ బాధితులను నమ్మిస్తున్నారు. వారి దగ్గరి నుంచి రూ.కోట్లు లాగుతున్నారు.
'నేను సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని - క్యాబ్ కోసం రూ.500 కావాలి' - నయా సైబర్ ఫ్రాడ్
- డబిల్‌పురాకు చెందిన వ్యక్తి తన స్థలాన్ని 8 ఏళ్ల క్రితం కిరాయికిచ్చాడు. అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ స్థలంపై నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రూ.2 కోట్ల ఆస్తిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు.
- రెడ్‌హిల్స్‌కు చెందిన మహిళ తన స్నేహితురాలి వ్యాపారంలో రూ.60 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. దాంతో ఇద్దరు భాగస్వాములయ్యారు. వ్యాపారం ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా టర్నోవర్ సాధించినా, లాభాలు వారి సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడంతో బాధితురాలు మోసపోయింది.
- నాంపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ స్థలాన్ని తమదిగా చెప్పి, బ్యాంకు నుంచి రూ.2.50 కోట్ల గృహ రుణం తీసుకున్నారు. ఈఎంఐలు చెల్లించకపోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
- కాచిగూడలో ఒక మహిళ చీరల వ్యాపారం చేస్తుండేది. దాన్నే ఆసరాగా చేసుకుని పెట్టుబడి పేరిట రూ.1.20 కోట్లు వసూలు చేసి ముఖం చాటేసింది.
- సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి షేర్ మార్కెట్లో రూ.లక్ష పెడితే రోజూ రూ.1000 వస్తాయని చెప్పగా నమ్మి నష్టపోయాడు. ఇదే తరహాలో దాదాపు 100 మంది రూ.4 కోట్ల మేర మోసపోయారు.
పెట్రోల్ బంకు వాళ్లు చీట్ చేస్తున్నారా? సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టిండిలా! - Petrol Pump Scams