ETV Bharat / state

మంత్రి కాకాణి అనుచరుడి దగ్గర పట్టుబడ్డ మద్యం డంప్​ - సర్వేపల్లిలో లక్ష సీసాల లిక్కర్​ ! - Liquor Bottles At YSRCP Leaders

Huge Quantity of Liquor at YSRCP Leaders: రెండు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడి వద్ద పట్టుబడ్డ భారీ మద్యం డంప్‌ వెనక అమాత్యుడే ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లోనూ వైసీపీ నేతలు నకిలీ మద్యాన్ని పంచి ప్రజల ప్రాణాలు తీశారని, ఆ అంశంలో కాకాణితో పాటు కావలి వైసీపీ ఎమ్మెల్యేపైనా కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో సైతం పంచడానికి లక్ష సీసాల మద్యాన్ని సర్వేపల్లిలో ఉంచారని ఆరోపిస్తున్నాయి. అది నకిలీ మద్యమేననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ నేతలకి ఎలా వచ్చాయో లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాయి.

liquor_at_ycp_leaders
liquor_at_ycp_leaders
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 7:49 AM IST

భారీ మద్యం డంప్‌ వెనక మంత్రి కాకాణి! - సర్వేపల్లిలో లక్ష సీసాలు ఉన్నాయా?

Huge Quantity of Liquor at YSRCP Leaders: మారు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. ఆయన ఇంట్లో భారీగా మద్యం నిల్వలున్నాయన్న ఫిర్యాదుతో సెబ్, పోలీసు సిబ్బంది ముత్తుకూరు మండలం పంటపాళెంలో తనిఖీలకు వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న సుధాకర్‌రెడ్డి 4,232 పైగా మద్యం సీసాలను 20 బస్తాల్లో నింపి మూడు కార్లలో తరలించేందుకు ప్రయత్నించారు.

సెబ్, పోలీసు సిబ్బంది వెంబడించి సుధాకర్‌రెడ్డి కారులో ఉన్న 7 బస్తాల మద్యం సీసాలను పట్టుకున్నారు. మిగతా 13 బస్తాల మద్యం ఆయన బంధువుల రొయ్యల చెరువులో డంప్‌ చేసినట్లు గుర్తించి, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున ఓటర్లకు పంపిణీ చేసేందుకే భారీ మొత్తంలో మద్యం సీసాలు నిల్వ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పంటపాళెంలో పట్టుబడ్డ మద్యంలో రాయల్‌ ప్యాలెస్, వైట్‌హాల్‌ బ్రాండ్ల సీసాలున్నాయి. ఇవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే బ్రాండ్లు.

ఒకరి వద్ద మూడుకు మించి మద్యం సీసాలు ఉండటం నేరం. అలాంటిది వైసీపీ నాయకుడి వద్దకు అన్ని వేల మద్యం సీసాలు ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన సరకును నేరుగా డిపోల నుంచి వైసీపీ నాయకుడి ఇంటికి చేర్చారా? లేదంటే మద్యం దుకాణాల నుంచే తరలించారా? అధికార పార్టీ నాయకుల అండదండలు లేకుండా ఇది సాధ్యమవుతుందా? ఎవరి కోసం వీటిని నిల్వ చేశారు? వాటికి డబ్బులు చెల్లించింది ఎవరనే కోణంలో తీగలాగితే ఆ డొంకంతా కాకాణి వద్దకే వెళ్తుంది. అయితే సెబ్ అధికారులు, పోలీసు సిబ్బంది మద్యంతో పట్టుబడ్డ వారిపైనే కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.

సినీఫక్కిలో వైసీపీ నేతల కార్లను చేజ్ చేసిన అధికారులు- 20 బస్తాల్లో 4232 మద్యం బాటిళ్లు స్వాధీనం - SEB Police Seized Liquor Dump

ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, గోదాములు, రహస్య స్థావరాల్లో దాదాపు లక్షకు పైగా క్వార్టర్‌ సీసాల మద్యం నిల్వ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మద్యం సీసాలు ప్రభుత్వ దుకాణాల నుంచి వెళ్లటం అంత సులభం కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులే కల్తీ మద్యం తయారు చేయించారు. దాని సీసాలపై నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్‌లను వేసి ఓటర్లకు పంచిపెట్టారు. కల్తీమద్యం తాగి అప్పట్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు.

ఈ వ్యవహారంలో అప్పట్లో కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్‌ కంసాని గోపాలకృష్ణస్వామితో కలిసి ఈ కల్తీ మద్యం దందా నడిపించారనేది అభియోగం. ఏ అధికారమూ లేనప్పుడే వైసీపీ నాయకులు కల్తీ మద్యం తయారుచేయించారు. ఇప్పుడు అధికారంలో ఉండటంతో 2014 ఏడాది మాదిరిగానే కల్తీ మద్యం తయారు చేసి నకిలీ లేబుళ్లు, హోలోగ్రామ్‌లతో కూడిన సీసాల్లో నింపి ఓటర్లకు పంచడానికి సిద్ధం చేశారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

గ్రామ సచివాలయంలో మద్యం బాటిళ్లు- తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్న అధికారులు - Liquor Bottles at Sachivalayam

వైసీపీ నాయకులు 2014 ఎన్నికల సమయంలో గోవా, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, తమిళనాడు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. అందులో హానికారక కెమికల్స్ ఉన్నాయని తెలిసినా వాటిని ఓటర్లకు పంపిణీ చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో అప్పట్లో ఈ నకిలీ మద్యం పంపిణీకి సంబంధించి వైసీపీ నాయకులపై 32 కేసులు నమోదయ్యాయి. 87 మంది అరెస్టయ్యారు. గత ప్రభుత్వం ఈ కేసులన్నింటినీ సీఐడీకి అప్పగించింది. న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో తాజాగా పట్టుబడిన మద్యం డంప్‌పై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించి స్వతంత్రంగా దర్యాప్తు చేయించకపోతే.. ప్రజల ప్రాణాలతో అధికార పార్టీ నాయకులు మళ్లీ చెలగాటమాడతారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో గంజాయి కలకలం - యువకులను పట్టుకున్న స్థానికులు - ganja seized near cm jagan house

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.