Donations To AP Flood Victims : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతలాకుతలమైంది. వాగులు, ప్రాజెక్టులు, నదులు పొంగి వరద ప్రభావానికి లక్షలాది మంది సర్వస్వం కోల్పోయారు. ప్రకృతి ప్రకోపానికి చెల్లాచెదురైన బాధితులకి మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాల ప్రజలు చేయూత అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి సహాయార్థం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో వారిని ఆదుకునేందుకు మానవతా దృక్పథంలో పలువురు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే విరాళాలు అందిస్తూ మీకోసం మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నారు. తాజాగా పలువురు దాతలు మంత్రి నారా లోకేశ్‌ను సచివాలయంలో కలిసి చెక్కులను అందించారు. డిక్షన్ గ్రూప్ రూ.1 కోటి, నెక్కంటి సీ ఫుడ్స్ రూ.1 కోటి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్‌మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు, రేస్ పవర్ సంజయ్ గుప్తా రూ.25 లక్షల చొప్పున విరాళం అందజేశారు.
లోకేశ్‌కు అందజేసిన దాతలు : ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూల్‌కు చెందిన డాక్టర్.కేవీ సుబ్బారెడ్డి రూ.11 లక్షలు, సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10 లక్షలు, ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు ఇచ్చారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలోఆల్ఫా ఇన్స్టిట్యూట్ రూ.5 లక్షలతో పాటు రైతులు ,కార్యకర్తలు కలిసి మరో రూ.5 లక్షలు, రక్ష హాస్పిటల్స్ నాగరాజు రూ.5 లక్షలను విరాళాలుగా అందజేశారు.
Floods Donors in AP : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది వంశీకృష్ణ, పెద్ది విక్రమ్ కలిసి రూ.3 లక్షలు, చదలవాడ చంద్రశేఖర్ రూ.3 లక్షలు , జర్నలిస్టు జాఫర్ రూ.1 లక్ష అందించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో సంధ్యా ఆక్వా రూ.1 కోటి, కొండేపి ప్రజలు, రైతుల తరపున రూ.6.80 లక్షలు, భీమవరపు శ్రీకాంత్ రూ.2 లక్షలు, ఆశాబాల రూ.1.8 లక్షలు, వి.జ్యోతి రూ.1 లక్ష చొప్పున లోకేశ్‌కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేసిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF
వరద బాధితులకు విరాళాల వెల్లువ- స్ఫూర్తిదాయకమని సీఎం అభినందనలు - Huge Donations To CMRF AP