Huge Donations to CMRF AP : ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుమేరకు వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు విరాళాలు అందించేందుకు ముందుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎంను కలిసి చెక్కులు అందించారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.రావు 5 కోట్లు, A.M గ్రీన్, గ్రీన్ కో సంస్థ 5 కోట్ల రూపాయల విరాళం అందించారు. ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అసోసియేషన్ కోటీ 50 లక్షలు, R.V.R. ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి, మోహిత్ మినరల్స్ సంస్థ 51 లక్షలు, కళ్యాణ్ ఆక్వారీస్ అండ్ మెరైన్ ఎక్స్ పోర్ట్ ఇండియా లిమిటెడ్ అధినేత ఓపర్తి రాజేంద్రబాబు 10 లక్షల రూపాయల చెక్‌ను సీఎంకు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా మహిళా సమాఖ్య 10 లక్షలు, కోటపాటి జనార్దన్రావు 10 లక్షలు, పాఐవీఓఎక్స్ (PIVOX) ల్యాబ్స్ 7 లక్షల 3 వేల 999 రూపాయలు విరాళం ఇచ్చారు. మధూర్ భార్గవ్ నాయుడు 5 లక్షలు, ఆల్ఫా ఎడ్యుకేషన్ సొసైటీ 5 లక్షలు, భార్గవ్ రామ్ నాయుడు 5 లక్షలు, కమలకుమారి 5 లక్షలు, చెన్నుపాటి గాంధీ, ఆర్.లక్ష్మీ కుమారి చెరో 5 లక్షలు విరాళమిచ్చారు.
వరద బాధితులకు విరాళాల వెల్లువ- స్ఫూర్తిదాయకమని సీఎం అభినందనలు - Huge Donations To CMRF AP
Donations to Flood Victims : విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ 7 కోట్ల 70 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. రాష్ట్ర పోలీసులు ఒకరోజు వేతనం 12 కోట్ల రూపాయలను డీజీపీ ద్వారక తిరుమలరావుకు అందజేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 10లక్షల విరాళం అందించారు.
వెయ్యి కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. వరద బాధితుల సహాయార్థం మంత్రి లోకేశ్‌కు దాతలు పెద్దఎత్తున విరాళాలు అందజేశారు. భూపతిరాజు సీతాదేవి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అమ్మన్న 5లక్షలు అందజేశారు.