Current Bill Payment With QR Code System in Telangana: జులై 1వ తేదీన థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి బిల్లులను చెల్లించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యుత్ బిల్లులను చెల్లించే వినియోగదారులకు (ఉత్తర తెలంగాణ) విద్యుత్ పంపిణీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. పేమెంట్ యాప్స్ స్థానంలో కొత్తగా ఇంటి వద్ద నుంచే బిల్లులు చెల్లించే వెసులుబాటును కల్పించారు. అదే క్యూఆర్ కోడ్ విధానం. ఇంటి వద్ద మీటర్ రీడింగ్ తీసినప్పుడు బిల్లు కింద ఈ క్యూఆర్ కోడ్ను ఇస్తారు. దాని ద్వారా మీకు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా విద్యుత్ బిల్లును చెల్లించే వెసులుబాటును విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకువచ్చింది.
ముందుగా ఇళ్లలో మీటర్ల నుంచి రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. వినియోగదారులు తమ మొబైల్స్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటును ఎన్పీడీసీఎల్ తీసుకువచ్చింది. ఇలా ఈజీగా బిల్లులను చెల్లించేలా ఏర్పాట్లు చేసింది.
ఇలా క్యూఆర్ కోడ్ ద్వారా విద్యుత్ బిల్లును చెల్లించే వెసులుబాటును ముందుగా ఎన్పీడీసీఎల్ పైలట్ ప్రాజెక్టుగా కొన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల(ఈఆర్వో) పరిధిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగా దశలవారీగా డిస్కంల పరిధిలోని అన్ని జిల్లాల్లో క్యూఆర్ కోడ్ బిల్లులు రానున్నాయని అధికారులు తెలిపారు. ఈ విధానంగా పూర్తిస్థాయిలో అమలైతే వినియోదారుడికి విద్యుత్ బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఇప్పటికే విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సంస్థ యాప్, వెబ్సైట్లలో బిల్లులను చెల్లిస్తున్నారు. ఇప్పుడు వాటికి క్యూఆర్ సిస్టమ్ అదనం.
థర్డ్ పార్టీ యాప్ ద్వారా కరెంటు బిల్లు చెల్లింపులు నిలిపివేత : జులై 1వ తేదీన విద్యుత్ పంపిణీ సంస్థలు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించే విధానాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. ఇక నుంచి డిస్కం వెబ్సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్లో కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు ముఖ్య గమనికను చేరవేసింది. ఈ చెల్లింపులు గత సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి.
మంచి స్నేహితుడి ఎంపిక మీ చేతిలోనే! - How to Choose A Good Friend