ETV Bharat / state

మొబైైల్ ఫోన్ చోరీ అయ్యిందా?- నో ప్రాబ్లమ్ తిరిగి పొందండిలా - CEIR recovery in telangana

CEIR Mobile Tracker : రైలు ప్రయాణం చేసేటప్పుడు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా చోరీకి గురవుతున్నది చరవాణిలే. దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా చోరీకి గురైన ఫోన్లను పోలీసులు గుర్తిస్తున్నారు. ఈరోజు సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో 150 ఫోన్లను రైల్వే అదనపు డీజీ మహేష్ భగవత్ బాధితులకు అందజేశారు.

How to Find a Lost Phone in CEIR
CEIR Mobile Tracker
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 8:43 PM IST

మొబైైల్ ఫోన్ చోరీ అయ్యిందా?- నో ప్రాబ్లమ్ తిరిగి పొందండిలా

CEIR Mobile Tracker : నేడు నిత్య జీవితంలో ఫోన్లు ఓ భాగమయ్యాయి. టెక్నాలజీ పుణ్యమా? అని సమస్త ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయింది. బస్ టికెట్ బుకింగ్ నుంచి ఆన్​లైన్ షాపింగ్ వరకు మొబైల్ ఫోన్లలోనే అన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే బ్యాంకింగ్ సంబంధించిన సమస్త సేవలు చరవాణిల ద్వారానే కొనసాగిస్తున్నాము. అటువంటిది మన ఫోన్ పోయనట్లయితే ఇక అంతే సంగతులు.

పోగోట్టుకున్న ఫోన్ల రికవరీ కోసం ప్రభుత్వం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ చోరీ అయిన వెంటనే స్థానిక పోలీసు స్టేషన్​లో మీరు ఒక్క ఫిర్యాదు చేస్తే చాలు. చోరీకి గురైన చరవాణిని ట్రాక్ చేసి పట్టుకుంటారు. అనంతరం మీకు అప్డేట్ ఇస్తారు. అలా ట్రాక్ చేసి పట్టుకున్న ఫోన్లను రైల్వే అదనపు డీజీ మహేష్ భగవత్ సంబంధిత వ్యక్తులకు పంపిణీ చేశారు. రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

మొబైల్స్ రికవరీలో హైదరాబాద్‌ టాప్‌ - ఫోన్‌ పోయిందా ఇలా చేస్తే ఈజీగా దొరికేస్తుంది

How to Find a Lost Phone in CEIR : ఇటీవల ట్రైన్లలో చోరీకి గురైన, తప్పిపోయిన ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్(CEIR Portal) ద్వారా నెల రోజులలో 150 ఫోన్​లను గుర్తించినట్లు మహేశ్ భగవత్ తెలిపారు. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. వీటిల్లో తెలంగాణలో 58 ఏపీలో 38 ఫోన్లు మిగతా ఫోన్లను హరియాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో గుర్తించినట్లు తెలిపారు.

రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు తమ ఫోన్ పోయిందని, ఏం చేయాలో తెలియకున్న సమయంలో పోలీసులను ఆశ్రయిస్తే తమకు ధైర్యం చెప్పడమే కాకుండా, తమ ఫోన్లను నెల రోజుల్లో కూడా తమకు అందించినందుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణ సమయంలో ఫోన్ పోగొట్టుకుంటే అనవసరంగా ఆందోళనకు గురవ్వకుండా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఫోన్ పోయినప్పటి నుంచి మళ్లీ చేజిక్కించుకునే క్రమాన్ని పోలీస్ అధికారి కుమార్ వెల్లడించారు.

సీఈఐఆర్ పోర్టల్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కోరారు. సీఈఐఆర్​కు సంబంధించి ప్రతి స్టేషన్​లో ఇద్దరు లేదా ముగ్గురు కానిస్టేబుళ్లకి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే భయపడకుండా ఉండాలని, ప్రయాణ సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని మహేశ్ భగవత్ సూచించారు.

"పోగోట్టుకున్న ఫోన్ల రికవరీ కోసం ప్రభుత్వం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ చోరీ అయిన వెంటనే స్థానిక పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయండి. ఐఎంఈఐ నెంబర్ ద్వారా ఫోన్​ను ట్రాక్ చేస్తాము. ఇటీవల ట్రైన్లలో చోరీకి గురైన, తప్పిపోయిన ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నెల రోజులలో 150 ఫోన్​లను గుర్తించాము". - మహేష్ భగవత్, రైల్వే అదనపు డీజీ

How To Find Lost Mobile : మీ మొబైల్​ ఫోన్​ పోయిందా.. టెన్షన్​ ఎందుకు.. 'సంచార్ సాథీ' తోడు ఉందిగా!

How to buy Second Hand Phone Legally? : సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా.. ఈ విషయం తెలుసా..?!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.