HMDA Ex Director Shiva Balakrishna Case Update : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ఏసీబీ అధికారుల(ACB) దర్యాప్తు వేగంగా జరుగుతోంది. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ (Shiva Balakrishna) చెల్లించిన రూ.2.70కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. కొన్ని నెలల క్రితం ఈ మొత్తాన్ని చెల్లించినట్లు గుర్తించారు. ఇంకా ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే అంశంపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో పాటు శివబాలకృష్ణ సోదరుడు కాకుండా మరో నలుగురు బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు.
HMDA Ex Director Shiva Balakrishna Brother Naveen : శివ బాలకృష్ణ ఆదేశాల మేరకు పని చేసిన అధికారుల వ్యవహరంపై కూడా దృష్ణి సారించారు. త్వరలో హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా(HMDA Director) ఉన్న సమయంలో శివబాలకృష్ణ వద్ద పనిచేసిన వారిని సైతం అధికారులు విచారించనున్నారు. మరోవైపు శివబాలకృష్ణ బినామీలుగా గుర్తించిన సత్యనారాయణ మూర్తి, పెంటా భరత్‌ను రెండు రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించారు. వారిపై శివబాలకృష్ణ కూడబెట్టిన బినామీ ఆస్తుల వివరాలు సేకరించారు. దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరు బినామీలను ఏసీబీ అధికారులు గుర్తించారు.
శివబాలకృష్ణ బినామీలను విచారిస్తున్న ఏసీబీ - ఆ ఇద్దరి పేరు మీద అనేక భూములు, స్థలాలు!
కస్టడీ విచారణలో ఏసీబీ వద్ద ఉన్న సమాచారానికి మాత్రమే శివబాలకృష్ణ సమాధానం చెప్పడంతో అన్ని ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు రెవెన్యూ సహా ఇతర శాఖలకు ఏసీబీ లేఖలు రాసింది. విచారణలో శివబాలకృష్ణ చెప్పిన ఐఏఎస్ అధికారి వ్యవహరంపై అతన్ని విచారించేందుకు న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధంగా ఉంది. వీరిద్దరు ఏఏ కాంట్రాక్టులు చేపట్టారు, వీరిద్దరి మధ్య ఉన్న లావాదేవీలను పరిశీలించనుంది.
శివబాలకృష్ణకు కోర్టులో చుక్కెదురు - బెయిల్ పిటిషన్ కొట్టివేత
IAS Involved in HMDA Ex Director Case : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టిన అంశం తెలిసిందే. ఇటీవల అతనిని ఎనిమిది రోజులు కస్టడీలో ఉంచి విచారించారు. ఆ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. పలు వివాదాస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఐఏఎస్‌కు భారీగా లబ్ధి చేకూరిందని శివబాలకృష్ణ విచారణలో తెలిపారు. వాటిల్లో తనకూ వాటాలు వచ్చినట్లు అంగీకరించాడు.
శివబాలకృష్ణ కేసు లేటెస్ట్ అప్డేట్ - ఆ ఐఏఎస్ అధికారిని విచారించే యోచనలో ఏసీబీ
ఐఏఎస్‌తో శివబాలకృష్ణ అవినీతి బంధం - ఇద్దరి లావాదేవీలు తేల్చే పనిలో ఏసీబీ!