ETV Bharat / state

మట్టిగణపయ్యకే ఆసక్తి చూపుతున్న యువత - మొదలైన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందడి - Demand for Clay Ganesh Idols - DEMAND FOR CLAY GANESH IDOLS

Huge Demand for Lord Ganesh Clay Idols : రాష్ట్రంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల కోలాహలం మొదలైంది. తొమ్మిదిరోజులపాటు విశేష పూజలందుకునే లంబోదరుడు మండపాల్లో కొలువుదీరాడు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కొందరు మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించారు. మట్టి వినాయకుడిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపాడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మట్టిగణపయ్యకు డిమాండ్ బాగానే పెరిగింది.

Demand for Eco Friendly Lord Vinayaka Clay Idols
Huge Demand for Lord Ganesh Clay Idols (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 7:24 AM IST

Updated : Sep 7, 2024, 7:37 AM IST

High Demand for Eco Friendly Lord Vinayaka Clay Idols : రాష్ట్రవ్యాప్తంగా ఊరూ-వాడ వినాయక చవితి సందడి నెలకొంది. బొజ్జగణపయ్య ప్రతిష్ఠాపనకు పెద్దసంఖ్యలో మండపాలు కొలువుదీరాయి. పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సూచించారు. వినాయక చవితి పురస్కరించుకొని హైదరాబాద్ అశోక్‌నగర్​లో మట్టి గణపతులు పంపిణీ చేశారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పును చట్టాన్ని గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని రక్షిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

లక్డీకాపుల్​లోని కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌లో భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంటోన్మెంట్​వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణనాథులకు ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దాదాపు వెయ్యి లడ్డూలను గణేశ్​ మండప నిర్వాహకులకు పంపిణీ చేసినట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈసారి జీహెచ్‌ఎంసీ 3 లక్షల 15 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. గణేశ్‌ నిమర్జనం కోసం నగరవ్యాప్తంగా 73 చెరువులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

'మట్టి వినాయకులను పూజించి సుప్రీంకోర్టు తీర్పు చట్టాన్ని గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యతా. మట్టి విగ్రహాల వల్ల కోర్టును గౌరవించినట్లు, పర్యావరణాన్ని రక్షించిన వాళ్లం అవుతాం'- పొన్నం ప్రభాకర్​, మంత్రి

పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయకులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి ఎంపీ రఘునందన్ రావు భక్తులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మట్టి ప్రతిమలకు భిన్నంగా ఆవు పేడతో విగ్రహాలు తయారు చేసి సిద్దిపేటకు చెందిన మొరంశెట్టి రాములు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు నిర్విరామంగా ఏడాదికి 5 నుంచి 6 వేల గోమయ విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటన్నింటిని ఉచితంగా పాఠశాలలకు, స్థానికులకు పంపిణీ చేస్తున్నారు.

తరగతి గదుల్లో విద్యార్థుల వినాయకుని తయారీ : తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు చిట్టి చేతులతో చక్కని మట్టి వినాయకులను తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సాధించారు. మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ వరంగల్‌లో పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీని చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చక్కని రూపాల వినాయక ప్రతిమలను తయారు చేసిన విద్యార్థులు, పాఠశాలలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

దర్శనమిస్తున్న మట్టి బొజ్జ గణపయ్య ప్రతిమలు : పర్యావరణాన్ని కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో అందరూ మట్టి గణపతి విగ్రహాలనే వాడాలని విద్యార్థులకు మట్టి విగ్రహాలు ఎలా తయారు చేయాలో భద్రాచలానికి చెందిన ఓ సాప్ట్​వేర్​ ఉద్యోగి నేర్పుతున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తూ తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. వరంగల్‌లోనూ బంక మట్టి, రాగిమట్టి గడ్డి, వెదురు బొంగులతో తయారు చేసిన గణనాథులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. నల్గొండ వ్యాప్తంగా మట్టి గణేశ్‌లు దర్శనమిస్తున్నాయి.

మట్టి గణనాథుడే ప్రకృతికి మంగళకరం - భవిష్యత్తుకు శ్రేయస్కరం - use clay idols save nature

ఆకట్టుకుంటోన్న 'సీడ్ గణేశ్​ల' ప్రతిమలు - పర్యావరణహిత విగ్రహాల తయారీ - Eco Friendly Seed Ganesha

Last Updated : Sep 7, 2024, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.