High Court on Rushikonda Illegal Buildings in Visakhapatnam : వైఎస్సార్సీపీ హయాంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్న నేతలు కోట్లు మూటకట్టుకున్నారన్నది జగమెరిగిన సత్యం. అవినీతి, అక్రమాలతో ఐదేళ్లు రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసిన నేతల అధికార దుర్వినియోగాలపై కేసులు అనేకం. ఇన్నేళ్లు అధికారం అండతో దర్జాగా ఉన్న వారికి బుద్ది చెప్పడానికి కూటమి ప్రుభుత్వం సిద్దంగా ఉంది. విశాఖ రుషికొండ దోపిడీపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
విశాఖ జిల్లా రుషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా భవనాలు నిర్మించి అప్పటి సీఎం జగన్, అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి, మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై కేసు నమోదు చేసేలా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పురోగతి లేదని పేర్కొంటూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి. గంగాధర్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
'21వ శతాబ్దపు నయా చక్రవర్తి'- రుషికొండ రాజమహల్లో కళ్లుచెదిరే నిర్మాణాలు - jagan bathroom
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్.చక్రవర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రుషికొండపై నిర్మాణాల విషయంలో రూ.420 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిన వ్యవహారంలో జూన్ 23న మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశానని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీకి కూడా జులై 9న వినతి ఇచ్చినా చర్యలు లేవని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. జగన్, జవహర్‌రెడ్డి, అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, జోగి రమేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఇతర మంత్రులు, అధికారులు నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, వీరిపై కేసు నమోదుకు ఆదేశించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషనర్ ఫిర్యాదుపై పురోగతి తెలియజేయాలని పోలీసులను ఆదేశించారు.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ అంశంలో అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి, అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, జోగి రమేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు, ఇతర మంత్రులు, అధికారులు నేరపూరిత విశ్వాస ఘాతుకాన్ని చేశారన్న ఆరోపణలున్నాయి.
రుషికొండపై హడావుడిగా 'ప్యాలెస్' - వినియోగంపై స్పష్టతేదీ జగన్?