High Court Objection to Authorities Allowing Gravel Mining: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి బౌద్ధ క్షేత్రానికి సమీపంలో గ్రావెల్ తవ్వకాలకు అధికారులు అనుమతివ్వడంపై హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. హడావుడిగా అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అధికారులను హైకోర్టు నిలదీసింది. సర్వేకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని పురావస్తు శాఖను ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకూ గ్రావెల్ తవ్వకాలను హైకోర్టు నిలుపుదల చేసింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - తగిన చర్యలపై ఈసీకి ఆదేశాలు
విచారణ వాయిదా వేసిన హైకోర్టు: కొడవలి గ్రామంలో ఉన్న ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రానికి సమీపంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ కొడవలి బుద్ధ మహా స్తూప పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు అయితా బత్తుల రామేశ్వరరావు, మరికొందరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది మహిత వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ సమ్మతి తీసుకోకుండా గనులశాఖ అధికారులు గ్రావెల్ తవ్వకానికి అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. విచక్షణా రహితంగా గ్రావెల్ తవ్వకంతో చరిత్రాత్మక బౌద్ధ క్షేతానికి ముప్పు పొంచి ఉందన్నారు. తవ్వకాల ప్రక్రియను నిలువరించాలని కోరారు.
నైపుణ్యంలేని వారు ఇంగ్లీష్‌లో ఎలా బోధిస్తారు?- జగన్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
పురావస్తుశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్కడ తవ్వకాలు జరుగుతున్న మాట వాస్తవమే అని అన్నారు. బౌద్ధ ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సర్వే చేయాల్సి ఉందన్నారు. మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. సర్వేకు నిర్వహించేందుకు సమయం కావాలని పేర్కొన్నారు. చారిత్రక ప్రదేశాలకు 200 మీటర్ల దూరం వరకు తవ్వకాలు చేయకూడదని చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వు: రాష్ట్ర గనులశాఖ ప్రభుత్వ న్యాయవాది నవీన్ వాదనలు వినిపిస్తూ నాలుగు చోట్ల గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇచ్చామన్నారు. బౌద్ధ క్షేత్రానికి 300 - 400 మీటర్ల దూరంలో తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. రహదారుల నిర్మాణం కోసం గ్రావెల్ తవ్వుతున్నామని తెలిపారు. రెండు వైపుల న్యాయవాదుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం భారత పురావస్తుశాఖ సర్వే నిర్వహిస్తామని చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ గ్రావెల్ తవ్వకాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇళ్ల పట్టాల పంపిణీపై హైకోర్టు విచారణ- వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు