ETV Bharat / state

అమెరికాలో జై బాలయ్య - న్యూ ఇంగ్లాండ్​లో NBK@50 ఇయర్స్ సెలబ్రేషన్స్ - NBK 50 Years Celebrations in USA

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 10:14 AM IST

Updated : Sep 16, 2024, 5:07 PM IST

Hero Balakrishna Golden Jubilee Celebrations : నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. న్యూ ఇంగ్లాండ్​లో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

Hero Balakrishna Golden Jubilee Celebrations in USA
Hero Balakrishna Golden Jubilee Celebrations in USA (ETV Bharat)

Hero Balakrishna Golden Jubilee Celebrations in USA : నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 14న అమెరికా న్యూ ఇంగ్లాండ్‌లో తరణి పరుచూరి అధ్వర్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ ఈవెంట్​లో బాలయ్య సినిమాల్లోని పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు.

ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నందమూరి బాలయ్య అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకలో జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేశారు.

ఈ కార్యక్రమానికి సుప్రీతా, శశాంక్‌లు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, బాలయ్య అభిమానుల్లో మరింత జోష్‌ను పెంచేందుకు సింగర్స్ హర్షిత యార్లగడ్డ, రాజీవ్‌లు బాలయ్య పాటలను పాడి అలరించారు. అనంతరం ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శైలజ చౌదరి అండ్ గ్రూప్ వారి నృత్యప్రదర్శన నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా కావడానికి రావి అంకినీడు ప్రసాద్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి, శ్రీకాంత్ జాస్తి, సురేష్ దగ్గుబాటి, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి, రావ్ కందుకూరి, శశాంక్, దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని సహకరించారు.

NBK 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ - వేడుకలో సినీ తారల సందడి! - NBK 50 Years Celebrations

ఇటీవల సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో బాలయ్య అభిమానులు, సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక బాలకృష్ణ 1974లోనే తెలుగు ఇండస్ట్రీలోకి తాతమ్మ కల అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అలా ఒక్కో సినిమాతో తన టాలెంట్‌తో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. 50 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోగా ఇప్పటికి ఉండటం విశేషం. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి పాత్రలకు ప్రాణం పోశారు. కొన్ని పాత్రలకు బాలకృష్ణ తప్ప మరెవ్వరూ సెట్టవ్వరు అన్నంతగా ఆ జీవిస్తారు. ఇలాంటి మరెన్నో చిత్రాలతో ప్రజల ముందుకు రావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.

అందరి ప్రశంసలు పొంది : బాలయ్య సినిమాల విషయానికొస్తే 1974 సంవత్సరంలో తాతమ్మ కల చిత్రంతో నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా వెండితెరకి పరిచయమై తన అద్భుత నటనతో అంచెలంచెలుగా ఎదిగారు. అంతేకాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా అందరి ప్రశంసలు పొంది, విశ్వవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు.

బాలయ్య తన 50 సినీ ప్రస్థానంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సరసన సుమారు 129 మంది హీరోయిన్స్ ఆడిపాడారు. ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యధిక మంది హీరోయిన్లతో నటించిన తొలి నటుడు ఈయనే. ఆయన కెరీర్ పరంగా చూస్తే హిస్టారిక్, బయోపిక్స్, మైథాలాజికల్, సైన్స్ ఫిక్షన్, సోషల్ వంటి అన్ని జానర్లలో నటించిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

బాలయ్య మంచి మనసు - తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు భారీ విరాళం - BALAKRISHNA DONATES 50 LAKHS TO TG

సెలవు పెట్టించి మరీ చెన్నైకి- 'తాతమ్మ కల' సెట్లో నాపై నాన్న ఫుల్ ఫైర్: బాలయ్య - NBK 50 Years Celebrations

Last Updated : Sep 16, 2024, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.