ETV Bharat / state

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు - పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు - Heavy Rains in Andhra Pradesh

Heavy Rains in Andhra Pradesh: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలకు అలర్ట్‌ మెసేజ్‌లు పంపాలన్నారు.

Heavy rains in Andhra Pradesh
Heavy rains in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 9:21 AM IST

Heavy Rains in Andhra Pradesh: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు.

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45-65కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అదే విధంగా నేడు, రేపు రాష్ట్రంలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్‌ సూచించారు.

CM Chandrababu on Heavy Rains: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

మ్యాన్ హోల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని, అన్ని శాఖలు అలెర్ట్​గా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని అన్నారు. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్​కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

మంత్రి నారాయణ ఆదేశాలు: విజయవాడలో వర్షంపై అధికారులను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్లో మాట్లాడిన మంత్రి నారాయణ, వర్షంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రెయినేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Heavy Rains in Andhra Pradesh

Rains in AP: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వర్షంలోనూ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రాజధాని గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో గుంటూరు-తుళ్లూరు రహదారిలో పెదపరిమి వద్ద కోటేళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోటేళ్లవాగు ఉద్ధృతితో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లాలో విద్యాసంస్థలకు డీఈవో సెలవు ప్రకటించారు.

ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతన్నాయి. నందిగామ మండలంలో నల్లవాగు, వైరా, కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అడిరావులపాడు వద్ద నల్లవాగు పొంగి రామన్నపేట-నందిగామ మార్గంలో, దాములూరు-వీరులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలో ఎడతెరపి లేని వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. అన్ని యాజమాన్య పాఠశాలలకు కలెక్టర్‌ సృజన సెలవు ప్రకటించారు. ప్రకాశం బ్యారేజ్‌లోని మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. విశాఖలో ఎడతెరిపి లేని వర్షాలకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.

ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని పలుప్రాంతాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఈదురుగాలులతో కురుస్తున్న వర్షానికి వాగులు, వంకల్లో భారీగా వరద చేరుతోంది. అచ్చంపేటలో విద్యుత్ ఉపకేంద్రాన్ని వరద చుట్టుముట్టింది. కెనాల్ కార్యాలయంలోకి వరద ప్రవాహం ప్రవహించింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, పోలవరం, కొయ్యలగూడెంలో ఎడతెరిపి లేని వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు - Low Pressure in Bay of Bengal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.