ETV Bharat / state

భారీ వర్షానికి కట్టలు తెగిన కట్లేరు- బెజవాడలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు - Heavy Rains in Andhra Pradesh

Heavy Rains in Andhra Pradesh : ఎడతెరిపిలేని వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. పహదారులు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. పలువురు నేతలు, కలెక్టర్లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తగిన రక్షణ చర్యలు చేపడుతున్నారు.

heavy_rains_in_andhra_pradesh_floods_in_bejawada
heavy_rains_in_andhra_pradesh_floods_in_bejawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 4:42 PM IST

Heavy Rains in Andhra Pradesh Floods in Bejawada : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లోని రోడ్లు జలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వన్ టౌన్ రాజగిరివారి వీధిలోని కొండపై నిర్మించిన ఓ ఇల్లు పాక్షికంగా కూలింది. ఇంటిలోని వారు అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటన గురించి తెలుసుకున్న వీఎంసీ (Vijayawada Municipal Corporation) అధికారులు ఇల్లు కూలిన ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కట్లేరు వాగు ఉధ్ధృతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన పరిశీలించారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు- ఉప్పొంగుతున్న వాగులు - Heavy rains in AP

Collector Srujana Visited Katleru Vagu : ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు కట్లేరు వాగు వరద ఉద్ధృతి పెరిగింది. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గంపలగూడెం మండలం వినగడప వద్ద తాత్కాలిక రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. గంపలగూడెం - చీమలపాడు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం వైపు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జోరుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు చోట్ల వాగులు, వరదలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ మురుగు రోడ్డు పైకి చేరింది. వ్యాధులు ప్రభలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ సృజన సూచించారు.

పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD

తిరువూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ సృజన విస్తృతంగా పర్యటించారు. కొండూరు మండలం చీమలపాడు పెద్ద తాండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. అనంతరం గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్లేరు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించిన కలెక్టర్‌ నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు.

అల్పపీడన ద్రోణి ప్రభావం - కురుస్తున్న వర్షాలు - Heavy Rains in Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.