ETV Bharat / state

ఏపీలో పలుచోట్ల వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - Heavy Rain Alert To AP

Heavy Rains in Andhra Pradesh : వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లో పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కాలనీల్లోని రోడ్లు, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వరద ప్రభావంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నైరుతి రుతుపవనాల్ని ఆహ్వానించేలా వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షాలు ఊరటనిస్తున్నాయి.

Heavy Rain in Andhra Pradesh
Heavy Rains Alert To Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 7:53 PM IST

ఏపీలో పలుచోట్ల వర్షాలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు (ETV Bharat)

Heavy Rains Alert To Andhra Pradesh : వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. పలుచోట్ల కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మరి కోన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. రహదారులపై భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలుపుతున్నారు.

ద్రోణి ప్రభావంతో ఆ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు : రాజస్థాన్ నుంచి విదర్భ తెలంగాణా మీదుగా బంగాళాఖాతం వరకూ విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ తెలంగాణా, మహారాష్ట్ర సహా వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్​కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని స్పష్టం చేసింది. ఈరోజు రాత్రికి ఇది తుపానుగా మారి ఆదివార అర్ధరాత్రికి సాగర్ ద్వీపం- ఖేపు పారా వద్ద తీరం దాటుతుందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం తుపాను ప్రభావం కోస్తాంధ్ర తీరంపై లేకపోయినా ఉపరితల ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల పాటు ఏపీలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తదుపరి వాతావరణం పొడిగా మారుతుందని స్పష్టం చేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు మరింత క్రియాశీలకంగా మారాయి. అలాగే ఈ రుతుపవనాలు మరింతగా పురోగమించి కేరళ తీరాన్ని ఈ నెల 31 లోగా తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - TELANGANA WEATHER REPORT TODAY

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు : విజయవాడలో ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నియోజకవర్గంలో అత్యధికంగా 86.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వర్షానికి పలు చెరువుల్లోకి నీళ్లు చేరాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.

కళ్యాణదుర్గం మండలంలోని చాపిరి చెరువులోకి భారీగా వర్షాపు నీరు చెరింది. అలాగే రాత్రి వీచిన ఈదురుగాలులకు బెలుగుప్ప మండలంలో 150 పైగా విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో మండలంలోని తొమ్మిది గ్రామాల్లో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. అలాగే వర్షానికి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కళ్యాణ​దుర్గంకు చెందిన నాగరాజు అనే రైతు అరటి తోట నీట మునిగి సుమారు రూ.3.50 లక్షల వరకు నష్టం వచ్చినట్లు తెలిపారు.

ఆ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం : కర్నూలు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. తెర్నేకల్- ఎమ్మిగనూరు మార్గంలో పలు చోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణాజిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, వీఎన్ పురం, ఇతర కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జలకళను సంతరించుకున్న చెరువులు : అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే రాయదుర్గం, కనేకల్, బొమ్మనహాళ్ మండలంలో భారీ వర్షం కురవడంతో చెరువులకు జలకల సంతరించుకుంది. గత ఏడాది తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన బోరు బావులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో ఖరీఫ్​లో పంటలు సాగు చేసుకోవడానికి రైతులు సిద్ధమౌతున్నారు.

తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు : అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప మండలంలో వర్షం దాటికి అంకంపల్లి, దుద్దేకుంట గ్రామాల్లో ఉద్యాన, అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. దీంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంకంపల్లి గ్రామంలో నరేంద్ర చౌదరి అనే రైతుకు చెందిన మూడు ఎకరాల బొప్పాయి పంట నేలకొరిగింది. దీంతో దాదాపుగా రూ.3లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. అలాగే శ్రీనివాసులు అనే రైతుకు చెందిన బొప్పాయి తోట నేలమట్టం అయ్యింది. మరో రైతుకు చెందిన అరటి తోట పూర్తిగా దెబ్బతింది. దీంతో సుమారుగా రూ. 6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు వెల్లడించారు. అధికారులు స్పందించి పంటలకు నష్టం పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

వర్షాల కారణంగా ధాన్యం తడిసి రైతులు అవస్థలు - వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ - Crops Damage Due to Untimely Rains

ఒక్కరోజులో బీభత్సం సృష్టించిన వర్షం : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన జోరు వానకు పట్టణంలోని విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యవసాయ మార్కెట్ వద్ద భారీ నీటి ప్రవాహానికి ప్రహరీ గోడ కూలింది. జిల్లెడుగుంట గ్రామంలో కొబ్బరి చెట్టుకు పిడుగు పడడంతో చెట్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నగరంలో చెలరేగిన గాలి వానకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు : బంగాళాఖాతంలో ఏర్పడ్డ 'రెమాల్' తుఫాన్ వల్ల రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుపాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్​కు 440 కిలఓమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావారణ శాఖ సంచాలకురాలు స్టెల్లా చెప్పారు. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని సోమవారం బంగ్లాదేశ్ తీరాన్ని తాకుతుందని ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తుపాన్ ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ తుపాన్ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా ముందుకుసాగుతున్నాయని వాతావారణ శాఖ సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వాన - వచ్చే 3 రోజులు కూడా వర్షమే​! - Heavy Rains in Telangana

ఆనవాయితీగా మారిన అకాల వర్షాలు - ప్రతి యాసంగిలో అన్నదాతకు ఇవే కష్టాలు! - Crops Damaged Due to Untimely Rains

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.