Heavy Rain Alert To Several Districts Of Telangana : రాష్ట్రంలో ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
చిలికా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం రాత్రి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతం వాయువ్య దిశలో కదిలి ఆదివారం ఉదయం అంతర్గత ఒడిశా, దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. రానున్న 12 గంటల్లో ఇది వాయువ్య దిశలో కదిలి ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్ప పీడనంగా బలహీన పడే అవకాశం ఉందని వివరించారు.
అలుగు పారుతున్న చెరువులు - ఆనందంలో అన్నదాతలు - వీడియో చూశారా? - RAINS IN NIZAMABAD TODAY NEWS
ఇళ్లలోకి చేరిన నీరు : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలకు కురవడంతో వరద నీరు ప్రభావం పెరిగింది.శ్రీరాములపల్లిలోని బీసీ కాలనీలో భారీగా వరద నీరు చేరింది. కాలనీలోని పలువురి ఇండ్లలో వరద నీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. డబ్బాల సాయంతో వాటిని తొలగించారు. సమాచారం అందుకున్న ఎంపీడీవో బాబు, సీఐ హరికృష్ణ గ్రామానికి చేరుకొని కాలని వాసులతో మాట్లాడారు. కాలనీలో చేరిన వరద నీటిని కిందికి తరలించేందుకు జేసీబీ వాహనంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నారు.
నిలిచిపోయిన రాకపోకలు : అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని మున్నేరు, ఆకేరు, పాకాల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గార్ల మండల కేంద్రం శివారులో చెక్ డ్యామ్‌పై నుంచి పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండడంతో గార్ల మండల కేంద్రం నుంచి రాంపురం , మద్దివంచ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY