ETV Bharat / state

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం - రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు - AP Weather Report - AP WEATHER REPORT

AP Weather Report: బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో శనివారం తెల్లవారు జామున తీరం దాటే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Heavy Rain Alert In AP
Heavy Rain Alert In AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 1:33 PM IST

Updated : Jul 19, 2024, 10:20 PM IST

Heavy Rain Alert In AP : బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న (AP Weather Report) అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో శనివారం తెల్లవారు జామున తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది.

దీని ప్రభావంతో శనివారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదాదవరి, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది.

గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం మూడు ఎస్డీఆర్‌ఎఫ్‌, రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఏపీలో భారీ వర్షాలు - మరింత బలపడనున్న అల్పపీడనం - విపత్తుల సంస్థ హెచ్చరిక - Heavy Rains in Andhra Pradesh

రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరిగింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి 7 వేల ఎకరాల్లోని పొలాలు నీటమునిగాయి.

కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరిలో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని మూసివేశారు. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రాపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు-వరరామచంద్రాపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. కోనసీమలోని రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో అల్పపీడనం - రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - AP Weather Update

అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు కొండ వాగులు పొంగుతున్నాయి. పాడేరు మండలం రాయగడ్డ, పరదానిపుట్టు వద్ద మత్స్యగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి బ్రిడ్జిపై వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడలో గెడ్డలు పొంగాయి. ముంచంగిపుట్టు మండలం బిరిగూడ గెడ్డ పొంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకు నియోజకవర్గం వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం బొందగూడ వద్ద కాజ్‌వేపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జ్ఞానాపురం పాత వంతెన వద్ద నీరు నిలిచింది. విశాఖ ఆర్‌అండ్‌బీ నుంచి బిర్లా వరకు సర్వీసు రోడ్డుపై వరద నీరు నిలిచింది. అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించాచరు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తాండవ, వరాహ నదుల్లోకి వరద వచ్చి చేరుతోంది. జిల్లాలో విద్యాసంస్థలకు నేడు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. రైవాడ, కొనాం జలాశయాల్లోకి భారీగా వరద చేరుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ విజయ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కల్యాణపులోవ రిజర్వాయర్‌లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గేట్లు ఎత్తి నీటిని సర్పా నదిలోకి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD

ఏలూరు జిల్లాలోని మన్యం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలివేరు, జల్లేరు, బైనేరు వాగు, అశ్వారావుపేట, పడమటి వాగులు పొంగుతున్నాయి. సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది.

భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండి పడింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 18.6 అడుగులు దాటడం, మూడు క్రస్ట్‌గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో గురువారం రాత్రి 7.45 గంటల సమయంలో కట్ట తెగింది.

అన్నదాతలను వెంటాడుతున్న వైఎస్సార్సీపీ వైఫల్యాలు- వర్షాలకు నీటమునిగిన పంటలు - Crops Damage

Last Updated : Jul 19, 2024, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.