ETV Bharat / state

జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి- ఎక్కడిక్కడ నిలిచిపోయిన వాహనాలు - flood on national highway

Heavy Flood Flow in Vijayawada National Highway : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల కారణంగా పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి.

FLOOD ON NATIONAL HIGHWAY
FLOOD ON NATIONAL HIGHWAY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 12:21 PM IST

Heavy Flood Flow in Vijayawada National Highway : ఎన్టీఆర్​ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. విజయవాడ- హైదరాబాద్​ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు వాగుకు వరద స్వల్పంగా తగ్గినా.. జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగానే ప్రవహిస్తుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు హైవేపై రాకపోకలు నిలిపేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు

భారీవర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికుల అవస్థలు - HEAVY RAINS IN AP

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఐతవరం గ్రామంలోని ఇళ్లలోకి నీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నందిగామ శివారు ప్రాంతంలోని అనాసాగారం వద్ద వరద పోటెత్తింది. కృష్ణానది నుంచి వరద దిగువకు రావడంతో పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పెసర, మినుము వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నాయి. మున్నేరు కృష్ణానది, ఎత్తిపోతల పథకాలు, చెరువులు, వాగులు ఆయకట్టు భూముల్లో సాగుచేసిన వరి, పత్తి, మిర్చి పంటపొలాలు దెబ్బతిన్నాయి.
వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలం - లంక గ్రామాలు జలమయం - Flood Effect in Guntur District

కుండపోత వర్షంతో కృష్ణా జిల్లా గజగజ - చెరువులను తలపిస్తోన్న పంటపొలాలు - Heavy Rains in Krishna District

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.