ETV Bharat / state

ఫ్రీ కరెంట్​కు రేషన్‌ కార్డే ప్రామాణికం - మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్ - Ration Card Mandatory Gruha Jyothi

Gruha Jyothi Scheme in Telangana 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్ అమలు చేయనున్న ఉచిత విద్యుత్‌ పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఉచిత కరెంట్‌కు రేషన్‌ కార్డు ప్రామాణికం అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌ కార్డు, ఆధార్‌, కరెంట్ కనెక్షన్‌ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారని వెల్లడించింది.

Gruha Jyothi Scheme in Telangana
Gruha Jyothi Scheme in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 7:21 AM IST

Gruha Jyothi Scheme in Telangana 2024 : ఆరు గ్యారంటీల్లో ఒకటైన గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను (200 Units Free Power ) ఉచితంగా ఇస్తామని అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. దీని ప్రకారం రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు.

Ration Card Mandatory Gruha Jyothi Scheme : ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌ కార్డు, ఆధార్‌, విద్యుత్ కనెక్షన్‌ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంట్ వాడుకున్న వారికి కరెంట్ సిబ్బంది జీరో బిల్లులు జారీచేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీ కల్లా ప్రభుత్వం రాయితీ పద్దు కింద డిస్కంలకు విడుదల చేస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్‌ చట్టం కింద, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది.

300 యూనిట్ల ఫ్రీ కరెంట్- ఏటా రూ.18 వేలు ఆదా- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా!

Gruha Jyothi Scheme Guidelines : ఇప్పటివరకు దరఖాస్తు ఇవ్వనివారు తమ కరెంట్ కనెక్షన్‌ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీవో లేదా మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వవచ్చు. వారికి కార్యాలయాల్లో రసీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్‌, రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి కరెంట్ సిబ్బంది వెళ్లి రేషన్‌ కార్డు, ఆధార్‌ వివరాలను తనిఖీ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో అర్జీలు, రశీదులు అందజేయవచ్చు.

200 Units Free Power in Telangana : ప్రజాపాలనలో ఉచిత విద్యుత్ (Gruha Jyothi Scheme)కోసం 81.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి రేషన్‌ కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కనపెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు. వీటిలోనూ రేషన్‌ కార్డుల వివరాలు లేనివి పెద్దసంఖ్యలో ఉన్నాయి.

జీరో బిల్లుల జారీ తర్వాతే అర్హుల సంఖ్యపై స్పష్టత : ఈ నెల(ఫిబ్రవరి)లో బిల్లు జారీ చేసినప్పటి నుంచి వచ్చే నెలలో బిల్లు జారీ చేసేనాటికి నెల రోజుల్లో 200 యూనిట్లలోపు వినియోగం ఉన్న అర్హుల ఇళ్లకు జీరో బిల్లు జారీ కానుంది. మార్చిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇళ్లకు జీరో బిల్లులు రావచ్చని అనధికారికంగా అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకూ జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే, మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి.

ఉచిత కరెంటుతో గ్రిడ్​పై ఎంత భారమెంత - అధ్యయనానికి కర్ణాటకకు అధికారులు

ఒక్కో కుటుంబానికి రూ.900 వరకు లబ్ధి! : ప్రస్తుత విద్యుత్ ఛార్జీల ప్రకారం లెక్కలు వేస్తే నెలలో కచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు రూ.900 వరకు ఆదా కానుంది. డిస్కంలు 200 యూనిట్ల వరకు మూడు రకాల స్లాబుల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. 1 నుంచి 100 యూనిట్ల వరకూ లోటెన్షన్‌(ఎల్‌టీ)-1ఏ కేటగిరీ, 1 నుంచి 200 యూనిట్ల వరకూ ఎల్‌టీ-1బీ1 కేటగిరీల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.

సచివాలయంలో సబ్సిడీ వంట గ్యాస్, ఫ్రీ కరెంట్ పథకాలు ప్రారంభం

ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.