Groudnut Seed Distribution Begins in Anantapur : ముందస్తు వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల్లో ఆనందం నింపుతున్నాయి. వేసవి దుక్కిలు చేసి పెట్టుకున్న రైతులు సమకూర్చుకునే పనిలోపడ్డారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్‌లో 7 లక్షల 26 వేల హెక్టార్లలో అన్ని పంటలు సాగు చేయనున్నారు. మొత్తం విస్తీర్ణంలో అధిక భాగం వేరుశనగ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి మొక్కజొన్న, కంది, ఆముదం పంటల విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది. వేరుశనగ రాయితీ విత్తనం కోసం రైతులు ఈ నెల 18 నుంచి రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వానల కారణంగా జూన్ నెలలోనే పంట వేసుకునే అవకాశం ఉందని అనంతపురం జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ రైతులకు సూచించారు.
ఉమ్మడి జిల్లాల్లోని 845 RBKల ద్వారా వేరుశనగ, కంది, మినుము, జీలుగ, పిల్లిపెసర సహా వివిధ పంటల విత్తనాలు రాయితీపై ఖరీఫ్ సాగుకు పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లాలో ఇవాళ్టి నుంచి, శ్రీసత్యసాయి జిల్లాలో ఈ నెల 29 నుంచి రాయితీ వేరుశనగ విత్తనం పంపిణీ చేయనున్నారు. ఈసారి వేరుశనగ విత్తనం 40 శాతం రాయితీతో పంపిణీ చేయనుండగా ధరను క్వింటాకు 9 వేల 500 రూపాయలుగా నిర్ణయించారు. 40 శాతం రాయితీ పోగా క్వింటాకు 5 వేల 700 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రైతుకు గరిష్ఠంగా 90 కిలోలు మాత్రమే రాయితీపై ఇస్తున్నారు. -సుబ్బయ్య, ఏపీ సీడ్స్ ఉమ్మడి జిల్లాల మేనేజర్
చెమటోడ్చినా దక్కని ఫలితం - కళ్లెదుటే ఎండిపోతున్న వేరుశనగ పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు
Better Seeds For Groudnut Crop : రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అంచనాలతో ఈసారైనా పంట చేతికి దక్కుతుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు. వారికి అన్ని విధాలా సహరిస్తూ విత్తనాలు అందించి పంట గురించిన సూచనలు తెలియజేస్తామని అధికారులన అన్నదాతలకు భరోసా కల్పించారు.
'ఎండ మండుతోంది.. పైరు ఎండుతోంది'.. మరో రెండు రోజుల్లో అలా జరగకుంటే..!