Govt Orders Suspending Former Director of Mines Venkata Reddy: గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ వీసీఎండీ వెంకట రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గనులు, ఇసుక తవ్వకాలు అంశాల్లో అక్రమాలు చేశారంటూ వెంకటరెడ్డి మీద అభియోగాలు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇసుక టెండర్లు, అగ్రిమెంట్లలో నిబంధనలు ఉల్లంఘించారని వెంకట రెడ్డిపై అభియోగాలు ఉన్నట్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు, ఎన్జీటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారని అభియోగాలున్నట్టు వెల్లడించింది.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా వెంకటరెడ్డి వ్యవహరించారని నివేదికలో వెల్లడైనట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. కోస్టు గార్డులో సివిలియన్ అధికారిగా ఉన్న వెంకట్ రెడ్డ్ ఏపీకి గత ప్రభుత్వ హయాంలో డెప్యుటేషన్‌పై వచ్చారని ప్రభుత్వం పేర్కోంది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ కింద సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ సమయంలో ఆయన హెడ్ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదంటూ ఆదేశాల్లో పేర్కోన్నారు. అయితే గనులశాఖ నుంచి ఆయన్ను బదిలీ చేయగానే రాష్ట్రం వదిలి హైదరాబాద్ పరారైనట్టు తెలుస్తోంది.
డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి: కడప జిల్లాకు చెందిన వెంకట్‌రెడ్డి రక్షణశాఖలో పనిచేస్తుండగా డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. విద్యాశాఖ నుంచి కీలకమైన గనులశాఖకు బదిలీ అయ్యారు ఆ తర్వాత అత్యంత కీలకమైన (ఏపీడీఎంసీ) APMDC ఎండీ పోస్టు కట్టబెట్టారు. ఇసుక దోపిడీకి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించారని విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలతో అంటకాగిన ఆయన సహజ వనరులను దోచిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక టెండర్లు దగ్గర నుంచి జేపీ వెంచర్స్‌కు కాంట్రాక్ట్ దక్కేలా చేయడం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ఆ సంస్థ ప్రభుత్వానికి 880 కోట్లు బకాయిలు ఉన్నా ఎలాంటి బకాయి లేదంటూ ఎన్వోసీ జారీ చేశారు. అలాగే బీచ్‌శాండ్, బొగ్గు టెండర్లలోనూ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటితో ఆయన డిప్యూటేషన్ కాలం ముగిసిపోయింది. ఇక్కడ రిలీవ్ కావాల్సి ఉండగా ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ నెలలోనే వెంకట్‌రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో కుదేలైన ఆక్వా రైతు- ఆస్తులు అమ్ముకుని వలస బాట - Aqua Farmers Problems