ETV Bharat / state

వసూళ్లు ఎన్ని? ఖర్చు ఎంత ? ఏపీఎస్​ఎఫ్​ఎల్​లో మొదలైన ఆడిట్​ - FIBERNET SCAM

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 7:54 AM IST

AP Govt Focus on Fibernet Scam: విజయవాడలోని ఏపీఎస్​ఎఫ్​ఎల్​ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు సంస్థ కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలో ఏమైనా ఆక్రమాలు చోటు చేసుకున్నాయా అనే కోణంలో ఆడిట్​ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ap_fiber_net
ap_fiber_net (ETV Bharat)
ఏపీఎస్​ఎఫ్​ఎల్​లో అక్రమాలు - దస్త్రాల స్కానింగ్​కు ప్రభుత్వం చర్యలు (ETV Bharat)

AP Govt Focus on Fibernet Scam : విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఫైబర్‌నెట్‌ దస్త్రాల స్కానింగ్‌ ప్రారంభమైంది. విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్డ్‌ సంస్థ దస్త్రాల పరిశీలన బాధ్యతలు అప్పగించారు. దీంతో గత ఐదేళ్లలో ఏపీఎస్​ఎఫ్ఎల్​ (APSFL)లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నారు.

విజయవాడలోని ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ ప్రధాన కార్యాలయం తాళాలను పోలీసు బందోబస్తు నడుమ 62 రోజుల తర్వాత అధికారులు తీశారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు ఈ సంస్థ కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత ఐదేళ్లలో సంస్థలో జరిగిన వసూళ్లు ఎంత? వాటిని ఎలా ఖర్చు చేశారు? ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా? అనే కోణంలో ఆడిట్‌ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దస్త్రాలను స్కానింగ్‌ చేయించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది.

ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ కుంభకోణం - రూ.151 కోట్లు గోల్​మాల్​ - AP FiberNet Scam Updates

విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్డ్‌ సొల్యూషన్స్‌ సంస్థకు చెందిన సిబ్బంది ఫైబర్‌నెట్‌ కార్యాలయంలోనికి వెళ్లి దస్త్రాల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(APMDC) దస్త్రాలనూ ఈ సంస్థే స్కానింగ్‌ చేస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఎన్ని అవసరం ఉంటుంది? ఎంత మంది సిబ్బందిని వినియోగించాలి? అనే అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సంస్థకు చెందిన అన్ని దస్త్రాలను విభాగాల వారీగా స్కానింగ్‌ చేయనున్నారు.

సంస్థలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రాకుండా కొందరు సిబ్బంది ఎన్నికల ఫలితాల తర్వాత దస్త్రాలను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్‌ జరిపించాలని దీనికోసం తొలుత దస్త్రాలను స్కానింగ్‌ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్న కాంట్రాక్టర్​, మేనల్లుడు హెచ్​ఆర్ - ఫైబర్​నెట్ మాజీ ఎండీ మధసూధన్​రెడ్డి అక్రమాలు - EX MD Frauds on FiberNet

స్కానింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు సంస్థ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో బుధవారం ఉదయం సంస్థ సీఈవో ప్రవీణ్‌ ఆదిత్య, స్కానింగ్‌ నిర్వహించే సిబ్బంది మినహా ఎవరినీ కార్యాలయంలోనికి అనుమతించలేదు. విభాగాల వారీగా తాళాలను సంబంధిత సిబ్బంది నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్కానింగ్‌ చేసే సిబ్బందికి ఇవ్వనున్నారు. విభాగాల వారీగా ఇవాళ్టి నుంచి స్కానింగ్‌ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.

ఏ ఏ విభాగాల దస్త్రాలను ఏ రోజు స్కానింగ్‌ చేయాలనే దానిపై ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ విభాగాలకు సంబంధించి ఎంపిక చేసిన సిబ్బందిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఫైబర్‌నెట్‌ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బంది నుంచి అధికారులు ప్రాథమికంగా కొంత సమాచారాన్ని సేకరించారు. వారు ఇచ్చిన సమాచారం కూడా విచారణలో కీలకంగా మారనుంది. గత ప్రభుత్వ హయాంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ఆఫర్‌ లెటర్‌ లేకుండానే కొందరు సిబ్బందికి జీతాలు విడుదల చేయాలంటూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జగన్మోహనరావు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.

కొన్ని జిల్లాల్లో సిబ్బంది నియామకానికి సంబంధించి మాజీ ఎండీ మధుసూదనరెడ్డి ఉత్తుర్వులు ఇచ్చారు. దాని ఆధారంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో వందల సంఖ్యలో సిబ్బంది నియామకాలు జరిపినట్లు లెక్కల్లో చూపారు. కానీ, ఎవరిని నియమించారు? వారికి సంబంధించి కనీసం బయోడేటా కూడా ఏపీఎస్​ఎఫ్​ఎల్​ సంస్థ దగ్గర లేదు.

వైఎస్సార్సీపీ అక్రమాలకు నిలయంగా ఫైబర్​నెట్​ - త్వరలో విచారణ కమిటీ - AP State Fibernet Ltd

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.