Government Focus on Construction Of Indiramma Illu : రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. మొదటి దశలో రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుపై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకు రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకారం తెలిపింది. గత నెలలో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో నిధుల కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా హడ్కో నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించి గృహ నిర్మాణం కావాల్సిన రుణం కోసం ప్రతిపాదనలను పంపింది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. కేంద్రం నుంచి కూడా ఆ మొత్తాన్ని సమీకరించాలని కూడా నిర్ణయించింది.
'ఇందిరమ్మ ఇళ్లు'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ గృహాలకు కేంద్రం సాయం తీసుకోవాలని యోచన
Hudco Loan To Telangana Goverment : ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా రుణం ఇవ్వాలని హడ్కో (హౌసింగ్ అండ్ డెవెలంప్మెంట్ కార్ప్) నిర్ణయించింది. అధికారులు సుమారు రూ.5 వేల కోట్ల రుణం కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక చేపట్టకపోవడంతో గత ప్రభుత్వం పంపిన రుణ ప్రతిపాదనలు కూడా ఉండడంతో ప్రాథమికంగా రూ.3 వేల కోట్ల రుణం మంజూరు చేసేందుకు హడ్కో అంగీకరించింది. మొదటి దశలో రూ.850 కోట్లు విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు 'ఈటీవీ భారత్'కు తెలిపారు.
మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడకల ఇళ్ల నిర్మాణం (Double Bedroom Constriction) చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. నిధులు అందుబాటులో లేకపోవడంతో అప్పట్లో నిర్మాణ పనులు చేపట్టిన రాష్ట్రం ప్రభుత్వం కొన్నింటిని చివరి దశలో నిలిపేసింది. రూ. 1000 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా ఆ పనులు పూర్తి చేయాలన్నది అప్పటి ప్రభుత్వ యోచనగా ఉంది. దీనికోసం గత ఏడాది నాటి ప్రభుత్వం హడ్కోకు ప్రతిపాదనలు పంపించింది.
‘గృహలక్ష్మి’ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం - ఆశావహుల ఎదురుచూపులు
అయితే శాసనసభ ఎన్నికల సమయానికి ఆ రుణం మంజూరు కాలేదు. తరవాత రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు కాంగ్రెస్ చేతికి వచ్చాయి. ఆ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు లేకపోవడంతో ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. మునుపటి ప్రభుత్వం చేసిన రుణ ప్రతిపాదనకు హడ్కో తాజాగా ఆమోదం తెలిపి, రూ. వెయ్యి కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. దీంతో నిలిచిపోయిన పనులను పూర్తి చేయటంతో పాటు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లించేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు - మార్గదర్శకాలు ఇవే!