ETV Bharat / state

ఆ ఊళ్లో పిలిస్తే పలికే దేవుళ్లు- ఒక్కరు కాదు వంద మంది రావడం పక్కా - Devudu Devudamma

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 12:29 PM IST

Gollupalem Villagers Common Name With Devudu and Devudamma: సత్య దేవుడు, కృష్ణ దేవుడు, మురళి దేవుడు, రామారావు దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ ఏంటీ! దేవుళ్ల పేర్లన్ని చదువుతున్నారనుకుంటున్నారా? కాదు ఇదంతా ఆ ఊళ్లో ఎవరి పేరైనా దేవుడు, దేవుడమ్మ అని ఉంటుంది. ఊరంతా ఒకటే పేరేంటి అనుకుంటున్నారా వారి వంశపారంపరంగా వస్తున్న ఆచారమిది. తరాలు మారినా వారంతా ఈ సంప్రదాయం మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ ఆచారమెక్కడో ఆ ఆనాయితీ వెనకున్న అసలు విషయమేంటో చుద్దాం పదండి.

Gollupalem Villagers Common Name With Devudu and Devudamma
Gollupalem Villagers Common Name With Devudu and Devudamma (ETV Bharat)

Gollupalem Villagers Common Name With Devudu and Devudamma : సత్య దేవుడు, కృష్ణ దేవుడు, మురళి దేవుడు, రామారావు దేవుడు. లక్ష్మీ దేవుడమ్మ ఇలా, ఆ ఊళ్లో ఎవరిని పలకరించినా దేవుడు, దేవుడమ్మ అని వినిపిస్తుంది. పిలుస్తారు. దేవుళ్ల పేర్లేంటి, అనుకుంటున్నారా! నిజమేనండి, ఆ పల్లెలో ఇంటికొక దేవుడు, దేవుడమ్మలు ఉంటారు. గ్రామంలోని రెండు వేల మందిలో ఇలా, రమారమి 600మంది వరకు ఈ పేర్లతోనే పిలవబడతారు. అక్కడ వంశపార్యం పరంగా వస్తున్న ఆచారమిది. తరాలు మారినా ఈ సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం పుట్టిన పిల్లలకూ ఇంట్లో మొదట పెట్టే పేరు దేవుడు, దేవుడమ్మే. ఈ ఆచారమెక్కడో, ఆ ఆనాయితీ వెనకున్న అసల విషయమేమిటో ఇప్పుడు చుద్దాం.

విజయనగరంజిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం. ఈ పల్లె జనాభా 2000. వీరిలో సుమారు 600మంది దేవుళ్లుంటారు. గొల్లి దేవుడు, తిరుపతి దేవుడు, కర్రి దేవుడు, మొకలొళ్ల దేవుడు, సింహాద్రి దేవుడు, చంద్రినాయుడు దేవుడు, లక్ష్మి దేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ, గొల్లి సత్యవతి దేవుడమ్మ, అక్కమ్మ దేవుడమ్మ. ఇలా ప్రతి ఇంటిలోనూ దేవుడు, దేవుడమ్మ ఉంటారు. ముఖ్యంగా గొల్లొళ్లు, తొత్తరొళ్లు, రొంగలి, ఈదిబిల్లోళ్లు, యోత్రాటోళ్లు కుటుంబాలకు చెందిన వారి ఇళ్లల్లో దేవుడు, దేవుడమ్మ పేర్ల తప్పనిసరి.

వజ్రకరూర్​లో వింత ఆచారం - అదేంటో తెలుసా? - vajrakarur donkey competitions

గొల్లుపాలెంలో దేవుడు, దేవుడమ్మని నామకరణం చేసే ఆనవాయితీ. వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అప్పటి నుంచి నేటి వరకు కూడా గ్రామస్థులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంట్లో మొదటి మగ, ఆడ సంతానికి దేవుడు పేరు తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. సింహాద్రి అప్పన్నపై ఉన్న భక్తి, విశ్వాసమే ఈ ఆచారం వెనకున్న అసలు రహస్యమంటున్నారు గొల్లుపాలెం వాసులు.

గొల్లుపాలెంలో ప్రతి గడపలో దేవుడు, దేవుడమ్మ పేర్లు కొనసాగుతుండటం విన్న, తెలిసిన వారందరికి వింతగానే గోచరిస్తుంది. అయితే ఒకే పేరుతో అంతమందికి గుర్తు పట్టడం ఎలా అన్న సందేహమూ రాక మానదు. ఇది నిజమేనండి. బయట వ్యక్తులకే కాదు వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు, తపాలశాఖ బట్వాడాల విషయంలోనూ గొల్లుపాలెంలో ఇదొక సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను అధిగమించేందుకు దేవుడు పేరుకు ముందు ఇంటిపేరు లేదా తాత, తండ్రుల పేర్లు ఉంటాయి. ఆ పేరుని బట్టి ఫలాన వ్యక్తి, ఫలాన మహిళ అని గుర్తిస్తామని, గ్రామస్థులు, అధికారులు చెబుతున్నారు.

ఆ ఊరికెళ్లి దేవుడు అని పిలిస్తే వంది మంది రావడం పక్కా - ఎందుకంటే? (ETV Bharat)

రతి మన్మథుడి అనుగ్రహం కోసం ఆ ఊరి యువకులు ఏం చేస్తారో తెలుసా? - Unique Tradition in Kurnool Dist

కాల క్రమేణా తరాలు మారుతున్న కొద్ది గొల్లుపాలెం ఆచారంలో మార్పు చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం జన్మిస్తున్న పిల్లలకు, పుట్టిన వెంటనే ఆనవాయితీ మేరకు దేవుడు, దేవుడమ్మ అని పిలుస్తారు. తర్వాత వారి నక్షత్రం, రాశి, పుట్టిన తేదీలో బలాబలాలను బట్టి ఇతర పేర్లు పెట్టుకుంటున్నారు. పాఠశాలలు, ఆధార్, రేషన్ కార్డుల్లో అధికారికంగా అదే పేర్లను కొనసాగిస్తున్నామని గొల్లుపాలెం ప్రజలు తెలియచేస్తున్నారు.

ఏదీ ఏమైనా దేవుడిపై ఉన్న భక్తిభావం, విశ్వాసం తన పేరులోనే ఇమిడ్చుకోవటం గొప్పే కదా. అదీనూ ఒకరిద్దరితో కాకుండా ప్రతి ఇంటిలోనూ శతాబ్దాలుగా ఆచారాన్ని కొనసాగించటం గొల్లుపాలెం ప్రజల నమ్మకానికి హ్యాట్సాప్.

Scorpions Festival at Kurnool District: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. కొండరాయుడికి తేళ్లతో పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.