ETV Bharat / state

ఇక Google Pay నుంచి గోల్డ్​లోన్ కూడా.. రుణాలు మరింత ఈజీగా.. చౌకగా! - Gold loans in Google pay - GOLD LOANS IN GOOGLE PAY

ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమైతే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది రుణం​. అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ వడ్డీకే గోల్డ్​లోన్ ఆఫర్​ చేస్తుంది గూగుల్​ పే.

GOLD LOAN IN GPAY
google pay loan apply (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2024, 3:57 PM IST

Gold Loans In Google Pay : డబ్బుల కోసం జనాలు పడే అవస్థలు అన్నీఇన్నీ కావు. అత్యవసరమైన వాళ్లంతా అప్పుల బాట పడతారు. అలాంటి మార్గాల్లో గోల్డ్ లోన్ ఒకటి. అయితే, బంగారం తాకట్టుతో రుణాలు పొందడం ఓ ప్రహసనం. అందులో రకరకాల కండీషన్లు ఒక ఎత్తయితే.. అధిక వడ్డీభారం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో.. తక్కువ వడ్డీకే గోల్డ్ రుణాలు అంటూ గూగుల్ ప్రకటించింది.

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఆర్థిక సేవల సంస్థ గూగుల్‌పే (జీపే) ద్వారా బంగారం తనఖా రుణాలు అందజేసేందుకు గోల్డ్ లోన్‌లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోని మొత్తం పసిడిలో 11% ఇండియాలోనే ఉందని గూగుల్‌ ఇండియా ఎండీ రోమా దత్తా చోబే పేర్కొన్నారు.

పసిడి రుణాలను జీపే ద్వారా : భారతీయులు బంగారంతో సుదీర్ఘ సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉన్నారని, అది పెట్టుబడికి మించినది ఆయన తెలిపారు. ఈ ఆస్తిని ఆర్థిక కార్యకలాపాల కోసం సమీకరించవచ్చని, అందులో భాగంగానే రుణాల కోసం ఆలోచన చేయవచ్చన్నారు. ఈ మేరకు భారతీయులకు అందుబాటు వడ్డీ రేట్లతో, పసిడి రుణాలను జీపే ద్వారా పొందొచ్చని.. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ 10వ ఎడిషన్‌ ఈవెంట్​లో తెలిపారు.

భారతదేశమంతటా ఇప్పుడు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు ఈ గోల్డ్​ లోన్​ ఆఫర్​ను సరసమైన వడ్డీ రేట్లకే, సౌకర్యవంతమైన వినియోగ ఎంపికలతో యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల రుణగ్రహీతకు (Borrower), రుణదాతకు భద్రతను పొందవచ్చు. ఇదే విషయాన్ని ఈ ఏడాది గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో టెక్నాలజీ కంపెనీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

యూజర్లకు మరింత చేరువగా జీపే : ఈ సేవలతో Google Pay దాని సురక్షిత రుణాలను అందించడానికి, డిజిటల్ చెల్లింపుల యాప్‌లో మరిన్ని క్రెడిట్ ఆఫర్‌లను పొందేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లతో వినియోగదారులకు ఫ్రెండ్లీగా మారిన జీపే. ఇప్పుడు ఈ గోల్డ్​ లోన్​ సేవలతో మరింత చేరువ కానుంది. ఇటీవల 'యూపీఐ సర్కిల్' ఫీచర్‌ను లాంఛ్ చేసింది. దీని ద్వారా ఒక యూజర్​ తన కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్​కు, తన సొంత యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయాన్ని కల్పించింది. అవతలి వ్యక్తులకు బ్యాంకు అకౌంట్​ లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబయి వేదికగా జరిగిన గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌, 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లతో జీపే రోజురోజుకు మరింత చేరువవుతుంది.

బంగారం తాకట్టు పెట్టి లోన్​ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి! - How Does A Gold Loan Work

Gold Loan Vs Personal Loan : గోల్డ్ లోన్​ Vs​ పర్సనల్ లోన్​.. ఏది బెస్ట్ ఆప్షన్​​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.