ETV Bharat / state

గల్లీ కా గణేశ్ ఆగయా - అంబరాన్నంటేలా 'గణపయ్య ఆగమన్' వేడుకలు - Ganesh Agaman Celebrations - GANESH AGAMAN CELEBRATIONS

Ganesh Agaman Celebrations : హైదరాబాద్​లో వినాయక చవితి సందడి మొదలైంది. అకాశాన్నంటేలా గణనాథుడికి స్వాగతోత్సవాలు ప్రారంభమయ్యాయి. గణేశ్​ ఆగమన్ వేడుకలను పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. డప్పుల చప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణా సంచా సందడి మధ్య యువత గణేశుడికి స్వాగతం పలుకుతున్నారు.

Ganesh Agaman Celebrations
Ganesh Agaman Celebrations (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 10:52 AM IST

Ganesh Agaman Celebrations : హైదరాబాద్​లో వినాయక చవితి సంబురాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భక్తులు రెట్టింపు ఉత్సాహంతో గణేశ్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు కలిసి వేడుకగా వినాయకుని మండపానికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మండపానికి కొంత దూరంలో భారీ వేదికను ఏర్పాటు చేసి ‘గణేశ్‌ ఆగమన్‌’ పేరుతో యువత భారీ స్వాగతోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గతంతో పోలిస్తే గణేశ్‌ ఆగమన్‌ ఉత్సవాలు ఈ సారి మరింత ఎక్కువగా కనిపించాయి. స్వాగత ఏర్పాట్లు కూడా అంబరాన్నంటాయి.

వేదికలతో స్వాగతం : నగరంలో ఈసారి లక్ష గణేశ మండపాలు వీధుల్లో కొలువుదీరుతాయని అంచనా. ఈసారి ఐదు అడుగులకు మించి ఎత్తుండే విగ్రహాలు 40వేలకుపైగా ఉంటాయని సమాచారం. వాటిని మండపాలకు తీసుకెళ్లేందుకు స్థానిక నేతలు, యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఇతర ప్రముఖులు 'గణేశ్‌ ఆగమన్‌' కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం రాంనగర్‌ కూడలిలో భారీ స్టేజితో నిర్వహించిన స్వాగత వేడుకే అందుకు నిదర్శనం. డప్పులచప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణసంచా సందడి మధ్య యువత గణేశునికి స్వాగతం పలికారు. అంబర్‌పేట, గౌలిగూడ, నాంపల్లి, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా ఉత్సవాలు జరిగాయి.

చెరువుల వద్ద సందడి : నగరంలోని దాదాపు 50 చెరువుల వద్ద గణేశ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నామని, మరిన్ని తాత్కాలిక కోనేరులను సిద్ధం చేస్తున్నట్లు బల్దియా పారిశుద్ధ్య విభాగం అధికారులు తెలిపారు.

నగరంలో ఆధ్యాత్మిక శోభ : మరోవైపు వినాయక చవితి ఉత్సవాల ప్రారంభం కానున్న నేపథ్యంలో భాగ్యనగరంలో అధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రతి వీధిలో వినాయక మండపాలు వెలుస్తున్నాయి. ప్లాస్టర్​ ఆఫ్ పారిస్​తో చేసిన విగ్రహాలు వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందని అందువల్ల ప్రతి ఒక్కరు మట్టితో చేసిన విగ్రహాలనే ఉపయోగించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మార్కెట్​లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఆకట్టుకుంటోన్న 'సీడ్ గణేశ్​ల' ప్రతిమలు - పర్యావరణహిత విగ్రహాల తయారీ - Eco Friendly Seed Ganesha

వినాయక చవితి పూజ టైమింగ్స్ ఇవే​ - ఈ రంగు వస్త్రాలు ధరించాలి - చంద్రుడిని ఆ సమయంలో చూడొద్దు! - Ganesh Chaturthi 2024 Pooja Timings

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.