ETV Bharat / state

సందడిగా యానాం జీఎంసీ ఇండోర్‌ స్టేడియం - సాయ్‌ ఆధ్వర్యంలో ఈతలో శిక్షణ - Free Swimming Training - FREE SWIMMING TRAINING

Free Swimming Training at Yanam GMC Indoor Stadium: పుదుచ్చేరిలోని యానాం జీఎంసీ బాలయోగి స్టేడియంలోని ఈత కొలను బాలబాలికలతో కిటకిటలాడుతోంది. ఏటా వేసవి సెలవుల్లోలాగానే ఈ సారి కూడా అధిక సంఖ్యలో చిన్నారులు ఈత నేర్చుకుంటున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-శాయ్ ఆధ్వర్యంలో యువత జాతీయ పోటీలకు ఇక్కడే శిక్షణ పొందుతున్నారు. చిన్నారులు ఈత కొట్టే దృశ్యాలు స్టేడియానికి వచ్చే వారిని కట్టిపడేస్తున్నాయి.

Free_Swimming_Training
Free_Swimming_Training (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 2:38 PM IST

Updated : May 29, 2024, 4:40 PM IST

సందడిగా యానాం జీఎంసీ ఇండోర్‌ స్టేడియం - సాయ్‌ ఆధ్వర్యంలో ఈతలో శిక్షణ (ETV Bharat)

Free Swimming Training at Yanam GMC Indoor Stadium: వ్యాయామాల్లో అత్యుత్తమమైనది ఈత. వేసవి సెలవుల్లో సేదతీరడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే వెసులుబాటు ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి ఈతకొలను బాట పడుతున్నారు. పుదుచ్చేరిలోని యానాం జీఎంసీ బాలయోగి స్టేడియంలోని ఈత కొలను అందుకు నెలవుగా మారింది. సాయ్‌ ఆధ్వర్యంలో వర్ధమాన ఆటగాళ్లు జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొనడానికి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.

బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price

యానాం ఓల్డేజి హోం సహకారంతో ఔత్సాహికులకు ఏటా ఉచితంగా ఈతలో శిక్షణ ఇస్తున్నారు. యానాంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి వందలాది మంది బాలబాలికలు వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యత నిధులతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో ఈత కొలను నిర్మించింది. ఈ ఈత కొలనును నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం రోశయ్య నవంబర్, 2011లో ప్రారంభించారు.

యానాం పరిసరాలలో గోదావరి నదితోపాటు, కాల్వలు ఉండటం, గతంలో అనేక మంది స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో రిలయన్స్ సీఎస్ ఆర్ నిధులతో ఈత కొలనును నిర్మించారు. అత్యాధునికమైన ఈత కొలను అందుబాటులో ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు దగ్గరుండి ఈత నేర్పిస్తున్నారు. వేసవి సెలవులకు ఇతర ప్రాంతాల నుంచి యానాం వచ్చే వారు ఈ కొలనును సద్వినియోగం చేసుకుంటున్నారు.

హత్యలు, అరాచకాలు, వేల కోట్ల ఆస్తులు - 'ఏపీ నయీమ్​ పిన్నెల్లి'పై టీడీపీ బుక్​ - Pinnelli Paisachikam Book

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- సాయ్ శిక్షణ కేంద్రం ద్వారా ఎంపికైన క్రీడాకారులకు 2017 నుంచి ఈ ఈత కొలనులోనే శిక్షణ కల్పిస్తున్నారు. శిక్షకుడు ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు గెలుచుకొన్నారు. ప్రస్తుతం 25 మందికి సాయ్ ద్వారా ఇక్కడ శిక్షణ కల్పిస్తున్నారు. 2012లో ఈత శిక్షకుడిగా చేరిన బొడ్డు జేమ్స్ ఇప్పటి వరకు 10 వేల మంది పైగా ఈత నేర్చించారు.

ఇక్కడ ఈత నేర్చుకున్న 30 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా సాధించారు. పిల్లలు ఈత నేర్చుకునేందుకు వస్తుంటే, పెద్దలు ఊబకాయం తగ్గించుకోవడానికి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి క్రమం తప్పకుండా వస్తున్నారు. ఈత కొడుతూ ఆనందిస్తున్నారు. ఏడాది పొడవునా యువతకు ఈత కొలనులో శిక్షణ అందిస్తూనే ఉండటం, మెలుకువళు నేర్పిస్తుండటంతో యువత వివిధ పోటీల్లో రాణిస్తున్నారు.

'గండికోట' ఎండిపోయింది- 900 ఏళ్లలో ఇదే తొలిసారి అంటున్న గ్రామస్థులు

Last Updated : May 29, 2024, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.