ETV Bharat / state

ఈ పయనం మీ జీవితాన్నే కాదు - ఈ దేశాన్నే మారుస్తుంది : వెంకయ్యనాయుడు - KP 21st Century IAS Academy - KP 21ST CENTURY IAS ACADEMY

Krishna Pradeep 21st Century IAS Academy : కృష్ణ ప్రదీప్‌ 21st సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ శిక్షణలో సివిల్స్‌ ర్యాంకులు సాధించిన 35 మందిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగింది. మరో గౌరవ అతిథిగా మాజీ అదనపు డీజీ డాక్టర్‌ ఆర్‌ఏ పద్మనాభరావు పాల్గొన్నారు.

Krishna Pradeep 21st Century IAS Academy
Krishna Pradeep 21st Century IAS Academy (ETV BHARAT)
author img

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 4:32 PM IST

Venkaiah Naidu felicitate Civils Rankers of KPIAS : భ‌ర‌త‌మాత‌కు సేవ చేసే అరుదైన అవ‌కాశం సివిల్ స‌ర్వీస్ ర్యాంక‌ర్ల‌కు మాత్ర‌మే ల‌భిస్తుంద‌ని, దాన్ని వాళ్లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మాజీ ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌కు వెంక‌య్య‌నాయుడు సూచించారు. కృష్ణప్రదీప్‌ 21st సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ శిక్షణతో సివిల్స్‌ ర్యాంకులు సాధించిన 35 మందిని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. ర్యాంకర్లు అందరికీ వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మరో గౌరవ అతిథిగా దూరదర్శన్ మాజీ అదనపు డీజీ డాక్టర్‌ ఆర్‌ఏ పద్మనాభరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, మీ ఈ పయనం మీ జీవితాన్నే కాదు, ఈ దేశాన్నే మారుస్తుందని తెలిపారు. సమాజం, ప్రజలు, దేశం అన్నింటిలో పరివర్తన తీసుకొస్తుందన్నారు. ఎంపికైన మీది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు భరతమాతకు సేవ చేసే అరుదైన అవకాశమని కొనియాడారు. కుల, మత, లింగపరమైన విభేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయులేనని, ఇక్కడ వేర్వేరు మతాలు, సంస్కృతులు, భాషలు, దేవుళ్లు ఉండొచ్చుకానీ మనమంతా భారతీయులమని అన్నారు.

'మీ నిబద్దతే మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మీ మీద బోలెడు ఒత్తిళ్లు ఉంటాయి. రాజకీయ బాస్‌లు ఉంటారు. కానీ మీకు అసలైన బాస్‌ ఎవరంటే దేశ ప్రజలే. అసలై భగవద్గీత, బైబిల్‌ లేదా ఖురాన్‌ భారత రాజ్యాంగమేనని గుర్తించుకోవాలి. మీ మనస్సాక్షికే కట్టుబడి ఉండాలి. నిజాయతీతో ఉండాలి. ప్రభుత్వాన్ని మీరే ప్రతిబింబిస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రధాని ఎవరైనా ఉండొచ్చుగానీ, సేవలన్నీ అందేది మీ ద్వారా మాత్రమే. అత్యున్నత నైతిక విలువలను పాటించాలి. స్వాతంత్య్రం తర్వాత అన్ని స్థాయిల్లోనూ విలువలు కొంత పడిపోతూ వస్తున్నాయి. కానీ ఇప్పటికీ విద్య, వైద్యం, పాలనాయంత్రాంగం మాత్రం అచలంగా ఉన్నాయి. మీకు జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం వీటన్నింటినీ ప్రతి ఒక్కరు తప్పక గుర్తుంచుకోవాలని' మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.

Krishna Pradeep 21st Century IAS Academy
సివిల్స్‌ ర్యాంకర్లకు సన్మానం (etv bharat)

'మీరు నిజాయతీపరులైతే అపార గౌరవం లభిస్తుంది. అది మీకు విశ్వాసాన్ని కల్పిస్తుంది. రిఫార్మ్‌, పెర్ఫార్మ్, అండ్‌ ట్రాన్స్‌ఫార్మ్‌ అంటారు. అడ్డంకులు అన్నింటినీ తొలగించుకుని ముందుకు వెళ్లాలి. ప్రజాసేవ, వారి అభివృద్ధికి నూరు శాతం కచ్చితంగా పని చేయాలి. నేను సాయంత్రం పూట మైకులో వాజ్‌పేయి వస్తున్నారని చెప్పేవాడిని, ఇలా మైకులో చెప్పే అబ్బాయి, ఒక రోజు ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అవుతాడని ఏ రోజు ఊహించలేదు. అలా అవకాశాలు అనేవి ఎప్పుడూ చెప్పిరావు, వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకుని వాటి సాయంతో వీలైనంత ఎక్కువ సేవ చేయాలని' వెంకయ్యనాయుడు అన్నారు.

2003లో ఇద్దరితో ప్రారంభమై : మరోవైపు దూరదర్శన్‌ మాజీ అదనపు డీజీ డాక్టర్‌ ఆర్‌ఏ పద్మనాభరావు మాట్లాడుతూ 2003లో కేవలం ఇద్దరితో ప్రారంభమైన ఈ అకాడమీ రెండు దశాబ్దాల పయనంలో ఎంతో సాధించిందని అన్నారు. ఇప్పుడు కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారని ప్రశంసించారు. మూడు దశలను దాటుకుని సివిల్స్‌ ర్యాంకు సాధించాలంటే చిన్న విషయం కాదని చెప్పారు. ఈ ర్యాంకులు సాధించిన వారిలో విభిన్న నేపథ్యాల వారు ఉన్నారని, కొందరు అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవాళ్లయితే మరికొందరు ఉన్నత ఉద్యోగాలను వదిలి వచ్చి కేవలం సివిల్స్‌ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లారని తెలిపారు.

యూపీఎస్సీ ఫలితాల్లో నలుగురు ట్వంటీఫస్ట్ అకాడమీ విద్యార్థులకు ర్యాంకులు - UPSC Results

ఐదు సంవత్సరాల సాధన - 703వ ర్యాంకుతో ఆదిలాబాద్​ యువకుడి విజయం - 703 Ranker Rajkumar Interview

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.