VIJAY PAUL IN RAGHURAMA TORTURE CASE : ఉప సభాపతి రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను మరోసారి విచారించారు. రిమాండ్‌లో ఉన్న ఆయన్ను రెండు రోజులు పాటు పోలీస్ విచారణకు కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలసిందే. ఇందులో భాగంగా కేసుకు విచారణ అధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దమోదర్ శుక్రవారం దాదాపు ఏడు గంటలపాటు తన కార్యాలయంలో విచారించారు.
విచారణ సమయంలో విజయ్‌పాల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని, మంచిగానే నడిచారని రిమాండ్‌కు తరలించేటప్పుడు మాత్రం గాయాలపాలై నడవలేకపోయారని, ఈ మధ్యలో ఏం జరిగింది? రఘరామకు గాయాలు ఎలా అయ్యాయి? అని ప్రశ్నించారు. ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? అని అడుగ్గా ఎవరకూ కొట్టలేదని, వచ్చినప్పుడే దెబ్బలు తగిలివుంటాయని భావిస్తున్నామని విజయ్‌పాల్ సమాధానం చెప్పినట్లు తెలిసింది.
రఘురామకృష్ణం రాజు సీఐడీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా వచ్చారని, తిరిగి వెళ్లేటప్పుడు దెబ్బలతో వచ్చినట్లు సాక్ష్యాలు వున్నాయని, నలుగురు వ్యక్తులు ముసుగు వేసుకొని వచ్చారు కదా? ఎవరు వారు అని ప్రశ్నిస్తే, తనకు తెలీదని పాత పాటనే వల్లివేసారు. ఎస్పీ వేసిన అనేక ప్రశ్నలకు తప్పించుకునే విధంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం విజయ్‌పాల్‌కు 50 ప్రశ్నలు సంధించింది. రఘురామను చిత్రహింసలకు గురి చేసింది ఎవరు?, వేధించాలని మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? అంటూ దర్యాప్తు అధికారులు కూపీలాగారు. సాక్ష్యాలను చూపుతూ ప్రశ్నించినా, తప్పించుకునేలా బదులిచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మరోసారి విచారించనున్నారు. అనంతరం గుంటూరులోని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట విజయ్‌పాల్‌ను హాజరుపరిచి తిరిగి జైలుకు తరలిస్తారు.
కాగా 2021 మార్చి 14న రాఘురామకృష్ణరాజును అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనలు మేరకు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కస్టడి సమయంలో తనపై హత్యాయత్నం జరగిందంటూ ఇటీవల గుంటూరులో రఘురామకృష్టరాజు ఫిర్యాదు చేయడంతో, అప్పటి ధర్యాప్తు అధికారిగా ఉన్న విజయ్‌పాల్‌ను ఏ-1గా ఉన్నారు. ఈ కేసును ప్రకాశం ఎస్పీని ధర్యాప్తు అధికారిగా నియమించారు.
'ఏం రాజు గారూ ఇలా చేశారు' - విరిగిపోయిన మంచాన్ని చూసి ఏమీ ఎరగనట్లు అడిగారు