ETV Bharat / state

చలికాలంలో ఆరోగ్య సమస్యలా? - అయితే ఈ ఆహారం తీసుకోవాలంటున్న వైద్యులు! - WINTER DIET

చలికాలంలో చిన్న నుంచి పెద్ద వరకు ఆరోగ్య సమస్యలు - న్యుమోనియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు అధికం - ఆరోగ్య అలవాట్లు మార్చాలంటున్న వైద్యులు

Food Habits Should be Followed in Winter
Food Habits Should be Followed in Winter (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2024, 3:08 PM IST

Food Habits Should be Followed in Winter : చలి తీవ్రత పెరుగుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు, జలుబు, వైరల్‌ జ్వరాల బారిన పడుతున్నారు. పెద్ద ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆసుపత్రులకు వచ్చే వారిలో చాలామంది వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. న్యుమోనియా కేసులు అధికంగా వస్తున్నాయి. చంటి పిల్లలు న్యుమోనియాతో పాటు, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొంటున్నారు. నిలోఫర్‌కు వచ్చే పిల్లల్లో అధికంగా 0-5 ఏళ్లలోపు వారు ఉంటున్నారని డాక్టర్లు పేర్కొంటున్నారు. అయితే చలికాలంలో సరైన ఆహారం తీసుకుంటే వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

బిగ్​ అలర్ట్​ - ఇవి తినకపోతే ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయట ! - పరిశోధనలో కీలక విషయాలు! - Good Food Habits for Healthy Heart

  • అల్పాహారంలో దోశ, ఇడ్లీతో పాటు చిరుధాన్యాలు తింటే మేలు. జొన్న రవ్వ, సజ్జలు, గోధుమ రవ్వతో చేసి ఉప్మా, రాగి ఇడ్లీ, మల్టీ గ్రెయిన్‌ పిండితో చేసిన రొట్టెలు, ఉడకబెట్టిన గుడ్డు, మొలకలు మంచివి.
  • అల్పాహారం తర్వాత మధ్యాహ్న భోజనానికి కమలాలు, నారింజ, బత్తాయి, దానిమ్మ పండ్లు తీసుకొవచ్చు
  • రోజూ గుప్పెడు అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ తినాలి.
  • సాయంత్రం ఉడకబెట్టిన బొబ్బర్లు, స్వీట్‌ కార్న్‌, డ్రైఫ్రూట్స్‌, సెనగలతో చేసిన చిక్కీ, లడ్డూ, నువ్వులు, వేరుసెనగ లడ్డూలు తినొచ్చు. సూప్స్‌, గ్రీన్‌టీ, జింజర్‌ టీలతో ఉపశమం లభిస్తుంది.
  • రాత్రిపూట భోజనం తొందరగా పూర్తి చేయాలి. డిన్నర్‌లో జొన్న, గోధుమ రొట్టెలు తినొచ్చు. వీటితో పాటు వెజిటెబుల్‌ కర్రీ, ఆకుకూర పప్పు లాంటి తేలిక పాటి ఆహారం తీసుకుంటే మేలు చేస్తాయి. రాత్రి తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే నిద్రకు ఆటంకం లేకుండా మరుసటి రోజు హుషారుగా మొదలవుతుంది.
  • చంటి పిల్లలకు 6 నెలల వరకు మాత్రమే తల్లిపాలు మాత్రమే తాగించాలి. ఆ తర్వాత తల్లిపాలతో పాటు ఇంట్లో తయారు చేసిన ఆహరం తినిపించడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు.
  • చలికాలంలో దాహం వేయదు అలా అని నీరు తాగకుండా ఉండకూడదు. కాస్త గోరువెచ్చని నీరు తాగడం శ్రేయస్కరం అని వైద్యులు చెబుతున్నారు.
  • వీటితో పాటు తగినంత వ్యాయామం కూడా అవసరం.

ఉపవాసం Vs తక్కువగా తినడం Vs ఎర్లీగా భోజనం చేయడం- బరువు తగ్గడానికి ఏది బెస్ట్ ఆప్షన్​?

ఎంత పనైనా చేసే మీరు ఇప్పుడు వెంటనే అలసిపోతున్నారా? - అయితే ఈ మార్పు చేసుకోవాల్సిందే! - Best Protein Foods For All

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.