ETV Bharat / state

రేణిగుంటలో బట్టబయలైన వైసీపీ కుట్ర - భారీగా పట్టుబడ్డ ఓటర్లకు పంచే వస్తువులు - FLYING SQUAD SEIZED YSRCP GIFTS - FLYING SQUAD SEIZED YSRCP GIFTS

Flying Squad Seized YSRCP Gifts Lorry: ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైసీపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. మునుపెన్నడూ లేనిరీతిలో తాయిలాల పంపిణీ కోసం కుట్రలు పన్నుతోంది. రేణిగుంటలోని గోదాముల నుంచి భారీగా వస్తువులను తరలిస్తున్న ఓ లారీ పట్టుబడటంతో వైసీపీ ప్రలోభాలపర్వం గుట్టు బయటపడింది.

Flying_Squad_Seized_YSRCP_Gifts_Lorry
Flying_Squad_Seized_YSRCP_Gifts_Lorry
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 10:50 AM IST

రేణిగుంటలో బట్టబయలైన వైసీపీ కుట్ర - భారీగా పట్టుబడ్డ ఓటర్లకు పంచే వస్తువులు

Flying Squad Seized YSRCP Gifts in Renigunta : ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార వైసీపీ పన్నిన కుట్ర బట్టబయలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు ఎరవేసేందుకు గోదాముల్లో భద్రపరిచిన వందల కోట్ల రూపాయల విలువైన తాయిలాలు బయటపడ్డాయి. రేణిగుంట అంతర్జాతీయ విమానశ్రయ సమీపంలోని 5 గోదాముల్లో వీటిని భద్రపరిచినట్లు అధికారులు గుర్తించారు. మునుపెన్నడూ లేనిరీతిలో అధికార వైసీపీ పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన తాయిలాలు బయటపడటం కలకలం రేపుతోంది.

వంటపాత్రలు, వినోద సాధనాలు, అలంకరణ వస్తువులు, విలువైన చీరలు ఇలా ఒక్కటేమిటి మనిషి జీవనానికి అవసరమైన అన్ని రకాల వస్తువులతో కూడిన తాయిలాలను సగటు సాధారణ ఓటరు ముగింటకు చేర్చేందుకు వైసీపీ చేసిన కుట్రలు భయటపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట మండలం రామకృష్ణాపురం సమీపంలోని ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసిన 52 రకాల వస్తువులను పోలీసులు పట్టుకున్నారు. ఓటర్లకు పంచేందుకు మంగళవారం మధ్యాహ్నం రామకృష్ణాపురం గోదాముల నుంచి వస్తువులను తరలిస్తున్న ఓ లారీ పట్టుబడటంతో వైసీపీ ప్రలోభాలపర్వం గుట్టు బయటపడింది.

సీఎం క్యాంప్​ ఆఫీసులోకి కంటెయినర్​- ఎందుకొచ్చింది, ఏం తెచ్చింది? - Suspected Container Vehicle

వస్తువులను దాచి ఉంచిన గోడౌన్‍ తెరిచేందుకు కొంత హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరున్నర గంటల వరకు తహసీల్దారు ఘటనా స్థలానికి రాకపోవడంతో గోడౌన్‍ తెరిచేందుకు వీలు పడలేదు. లారీని పట్టుకున్న తర్వాత పంచనామా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రేణిగుంట తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. 5 గంటల తర్వాత ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల ఒత్తిడితోనే ఆలస్యంగా చేరుకున్నారన్న ఆరోపణలున్నాయి.

ఆ తర్వాత గోదాములు తెరిచేందుకు తాళాలు లేవంటూ తాత్సారం చేశారు. టీడీపీ నాయకులు నిరసన చేపట్టడంతో రాత్రి 8గంటల సమయంలో గోదాము తెరిచారు. లోపల దాచిన వందల కోట్ల రూపాయల విలువైన వస్తువులు బయటపడ్డాయి. గోదాములో దొరికిన పుస్తకాలలో గత 2 నెలలుగా తాయిలాలను పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, కొండెపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ్యుల పీఏలకు చేర్చినట్లుగా అందులో పొందుపర్చారు.

వైసీపీ నేతల అధికార గర్వం - అర్చకులపై ఆగని దాడులు - YSRCP Leaders Attacks on Priests

తిరుపతి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, నియోజకవర్గాలకు గత నెల 23వ తేదీన చేర్చారు. గుంటూరు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, గుంటూరు-తూర్పు, గుంటూరు-పశ్చిమ, తాడికొండ నియోజవర్గాలకు వస్తువుల్ని పంపారు. పల్నాడు, బాపట్ల, నెల్లూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాలకు వస్తువులను పంపినట్లు పుస్తకంలో పొందుపర్చారు.

ఓటర్లకు పంపిణి చేసేందుకు సిద్ధం చేసిన వాటిలో బొట్టు బిళ్లలు, ఫొటో కీచెయిన్లు, చేతి వాచీలు, ఫ్యాను కీచెయిన్లు, చరవాణి స్టాండ్లు, నాప్​కిన్లు, బండి, కారు మీద పెట్టుకునే జెండాలు, టీషర్టులు, చిన్న, పెద్ద గొడుగులు, టోపీలు, మోడల్ ఈవీఎంలు, వీఐపీ సిల్కు కండువాలు, బ్యాడ్జీలు, రేడియం కార్ స్టిక్కర్లు, చీరలు, మైక్ సెట్లు వంటివి ఉన్నాయి. నిబంధనలు అతిక్రమించి ఓటర్లకు తాయిలాలు అందిస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత నరసింహయాదవ్ డిమాండ్ చేశారు.

Lokesh on YSRCP Gifts Lorry Seized Incident: కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పందించారు. ఓటమి భయంతో తాయిలాలతో ఓటర్లను ఏమార్చేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందన్నారు. ఐదేళ్ల జగన్ అరాచకపాలనకు ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి కిలో బంగారమిచ్చినా జగన్​కు ఓటమి తప్పదని లోకేశ్​ ధ్వజమెత్తారు.

ఎన్నికల వేళ మళ్లీ జనం బాట పట్టిన జగన్ - ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర - JAGAN BUS YATRA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.