ETV Bharat / state

20 గంటల పాటు చీకటి గదిలో బందీగా బధిర బాలుడు - ఆ తర్వాత ఏమైందంటే? - 5 Years Old Boy Missing in Hospital

Five Years Old Boy Missing in Hospital Found Safe in Doctor Room : మాటలు రాని, వినపడని ఓ ఐదేళ్ల బాలుడు ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయ్యూడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

5 Years Old Boy Missing in Hospital
5 Years Old Boy Missing
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 3:22 PM IST

Five Years Old Boy Missing in Hospital Found Safe in Doctor Room : మాటలు రాని, వినపడని ఓ ఐదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. తల్లిదండ్రులను, ఆసుపత్రి సిబ్బందిని ఆందోళనకు గురి చేసిన ఈ ఘటనలో బాలుడు సురక్షితంగా (Safe) ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే,

kurnool sarvajana hospital : ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కుమారుడు సుజిత్ (5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఈ నేపథ్యంలో శస్త్ర చికిత్స నిమిత్తం 20 రోజుల కిందట కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా (Anesthesia) విభాగాధిపతి గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది అదే సమయంలో ఆ గదిని శుభ్రం చేసి చిన్నారిని గమనించకుండా తాళం (Lock) వేసుకుని వెళ్లిపోయారు. ఆపై బయట నుంచి వచ్చిన తల్లి మౌనిక కుమారుడు కనపడకపోవడంతో సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

బెంగళూరులో బాలుడు మిస్సింగ్​- హైదరాబాద్​ మెట్రోలో ప్రత్యక్షం

ఆసుపత్రి సిబ్బంది ఎంత ప్రయత్నించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది, ఆ వైద్యుడి గది తలుపులు తెరవగా సుజిత్ అక్కడ కనపడటంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే విషయం తల్లిదండ్రులకు చెప్పారు. బిడ్డ ఆచూకీ కోసం గంటల పాటు వెతికిన తల్లిదండ్రులు సురక్షితంగా ఉన్న సుజిత్​ను చూసి ఊపిరి పీల్చుకున్నారు. పిల్లాడు ఆ గది ఫ్రిజ్​లో ఉన్న నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాడని సిబ్బంది తెలిపారు.

Tamilnadu Woman Missing Case Chased By Mahbubabad Police : తమిళనాడులో తప్పిపోయి.. మహబూబాబాద్​లో ప్రత్యక్షం.. 15 నిమిషాల్లోనే..!

సిబ్బంది తీరుపై ఆగ్రహం : అయితే పిల్లాడు ఒక రోజంతా గదిలో ఉండి, ఫ్రిజ్​లో ఉన్న నీటిని తాగి ప్రాణం నిలుపుకున్నాడు. అదే మరోలా జరిగి ఉంటే, ఆ తల్లిదండ్రుల ఆవేదనకు ఎవరు బాధ్యులు అని వార్డు సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉండగా, పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఇన్​స్టాగ్రాం ద్వారా పరిచయమైన అబ్బాయిలను కలిసేందుకు తొమ్మిదో తరగతి అమ్మాయిల ప్లాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.