Spate Murders in Hyderabad : హైదరాబాద్ నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం 24 గంటల్లో 5 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్లు సమాచారం. ఈ దాడులు కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ఠాణా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ప్రత్యర్థి వర్గానికి కొందరు పోలీసు సిబ్బంది కొమ్ముకాసి బాధితులకు అన్యాయం చేయడంతో చిన్నపాటి గొడవలు సైతం ప్రతీకార దాడులు, హత్యలకు దారి తీస్తున్నట్లు తెలుస్తోంది.
నగరంలో వరుస హత్యలు : కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఈ హత్యలు జరిగాయి. పాతబస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అలాగే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీద్, ఫక్రుద్దీన్ అనే ఇద్దరిపై దుండగులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. మరోవైపు అసిఫ్ నగర్లో అలీం అనే వ్యక్తిని దారుణంగా హతమార్చారు. కాచిగూడ ఠాణా పరిధిలో ఖిజార్ను చంపి రైల్వే పట్టాల సమీపంలో మృతదేహాన్ని నిందితులు పడేశారు.
అలాగే అసిఫ్ నగర్లో అలీం అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. మరోవైపు సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్‌లో అజార్ అనే రౌడీషీటర్‌ను దారుణంగా హత్య చేశారు. తుకారం గేట్ ఠాణా సమీపంలోని అడ్డగుట్టలో భార్య రోజాను హత్య చేసి భర్త పరారయ్యాడు. గత వారంలో బాలపూర్లో ముబారక్ సిగార్ని దుండగులు వెంటాడి హతమార్చారు. ఇలా వరుస హత్యలతో నగరంలో ప్రజలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. నిందితులు ఎవరో తెలియక థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.
నగరంలో కరువైన పోలీసు గస్తీ : గతంలో రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ ఉండేది. పోలీసులు తరచూ గస్తీ కాస్తుండే వారు దాంతో ఎక్కువగా రాత్రిపూట నేరాలు జరగకపోయేవి. కానీ ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతాల్లో నిఘా లేకపోవడంతో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసు గస్తీ ముమ్మరంగా ఉండి నేరాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ సుస్థిరంగా ఉండేదని, ఇప్పుడు అడుగడుగునా సీసీ కెమెరాలున్నా దారుణాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై గస్తీ లేకపోవడంతో రోడ్లపై దుండగులు కత్తులతో స్వైరవిహారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
డేట్‌కు వెళ్లి 'మెమొరీ' కార్డ్ చోరీ- 4ఏళ్ల తర్వాత వెలుగులోకి జంట హత్యలు- చివరకు!