ETV Bharat / state

సామాన్యుడిగా పుట్టి - అసామాన్యుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తి రామోజీరావు - సినీ ప్రముఖుల నివాళులు - FILM INDUSTRY condolence TO RAMOJI RAO

Film Industry Condolence to Ramoji Rao : సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని సినీ ప్రముఖులు కొనియాడారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు ఫిల్మ్‌ ఛాంబర్‌లో నివాళులర్పించారు. ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.

MOVIE DIRECTORS condolence TO RAMOJI
Film Industry condolence to Ramoji Rao (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 9, 2024, 7:43 PM IST

రామోజీరావుకు నివాళులర్పించిన సినీ ప్రముఖులు (ETV Bharat)

Film Industry Condolence to Ramoji Rao : చిత్రపరిశ్రమలో రామోజీ రావు తనదైన ముద్ర వేశారని సినీ ప్రముఖులు కొనియాడారు. రామోజీరావు ఓ మానవ రత్నమని పత్రికా ప్రపంచంలో నూతన ఒరవడిని సృష్టించారన్నారు. పత్రిక ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించారని వివరించారు. సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తిగా ఎదిగారని తెలిపారు.

రామోజీరావు మరణం తెలుగు సినీ పరిశ్రమకి తీరని లోటు అని, రాష్ట్రం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సినీ పరిశ్రమలు చెందిన పలువురు అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు. ఎంత ఎదిగిన నేల మీద నడిచే వ్యక్తి అని ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు.

Senoir Movie Actors Condolence to Ramoji Rao : ఫిల్మ్​సిటీకి వెళ్తే సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలుగుతుందని శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యల కోసం వారందరి తరపున పోరాటం చేసింది ఆయనేనని కే.ఎస్ రామారావు అన్నారు. తమ అమ్మా నాన్న రామోజీ సంస్థలైన ప్రియా పచ్చళ్ల కంపెనీలో పని చేసే వారని, పత్రికా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన రామోజీ మహనీయుడని పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని, పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ఎన్నో విప్లవాలకి ఊపిరి లూధారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రవి అన్నారు.

రామోజీరావు అంతిమయాత్ర - పాల్గొన్న రాజకీయ నాయకులు, సినీ నటులు - Ramoji rao Funeral Gallery

Tollywood Actors Condolences : చావంటే నేను ఉన్నప్పుడు రాదు అది వస్తే నేను ఉండను అని వ్యాఖ్యానించిన గొప్ప వ్యక్తి అని వీరశంకర్ గుర్తు చేసుకున్నారు. భారతంలో భీష్ముడికి ఎప్పుడు చనిపోవాలో తెలుసు అని అలాగే రామోజీ తాను సాధించాల్సినవన్నీ చేశారని దర్శకుడు అజయ్ కుమార్ అన్నారు. తాను పది సినిమాలు రామోజీ ఫిల్మ్​సిటీలోనే చిత్రీకరించాలని దర్శకుడు సుబ్బారెడ్డి గుర్తు చేసుకున్నారు. రామోజీ అనే ఒక మహావృక్షం కింద ఎంతో మంది ఆశ్రయం పొందారని తనకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తి అని ప్రముఖ కళాకారుడు శివారెడ్డి అన్నారు.

రామోజీరావు పాడె మోసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు - CHANDRABABU ATTENDS RAMOJI RAO FUNERAL

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.