Fight Between Theater Management and jr NTR Fans : దేవర సినిమా విడుదల సందర్భంగా కడపలోని ఓ థియేటర్ యాజమాన్యానికి, అభిమానులకు మధ్య భారీ స్థాయిలో గొడవ చెలరేగింది. రాజా థియేటర్‌లో అర్ధరాత్రి ఒంటిగంటకు దేవర సినిమా ప్రదర్శించారు. మెుదటి షో కావడంతో భారీగా అభిమానులు థియేటర్‌కు వద్దకు తరలివచ్చారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు లోపలికి వెళ్లారు. ఇదే సమయంలో చాలామంది ప్రేక్షకులు టికెట్లు లేకుండానే సినిమా థియేటర్లోకి వెళ్లడంతో హాలు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది.
గమనించిన థియేటర్ యాజమాన్యం టికెట్లు లేని వారిని బయటికి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో అభిమానులకు థియేటర్ యాజమాన్యానికి మధ్య గొడవ చోటుచేసుకుంది. గందరగోళం మధ్య సినిమా ప్రదర్శనను కాసేపు ఆపేశారు. చివరికి పోలీసులు రంగప్రవేశంలో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం సినిమాను కొనసాగించారు. ఈ సందర్భంగా గొడవకు కారణమైన కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్టీఆర్ 'దేవర' మూవీ రివ్యూ - ఎర్ర సముద్రం పోటెత్తింది! - DEVARA MOVIE REVIEW
ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు : అయితే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన చిత్రం దేవర. జాన్వీ కపూర్ ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రమిది. పైగా ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్‌తో ఎన్టీఆర్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇలా ఇవన్నీ కలిసి రావడంతో దేవరపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హిట్ కొట్టాలని పట్టుదలతో : ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని పట్టుదలతో కొరటాల శివ తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. అయితే రిలీజ్‌కు ముందే ప్రీ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో పలు రికార్డులు క్రియేట్ చేసిన 'దేవర' ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో రిలీజైంది.
బ్లాక్ బస్టర్ 'దేవర' - OTTలోకి ఎన్ని రోజుల తర్వాత, ఎక్కడ వస్తుందంటే? - Devara Movie OTT Details