ETV Bharat / state

'ప్రజాభిప్రాయం మేరకే 'రైతు భరోసా'పై నిర్ణయం - ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు' - Farmers Opinion on Rythu Bharosa

Rythu Bharosa Scheme Implementation : రైతు భరోసాపై ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రజాభిప్రాయం మేరకే తీసుకుంటుందన్నారు. రైతు భరోసాపై అన్నదాతల అభిప్రాయాలను శాసనసభలో చర్చిస్తామన్నారు. రేషన్‌ కార్డు లేని వారికి రుణమాఫీ ఉండదని, ఇన్‌కమ్​ ట్యాక్స్​ ఫైలింగ్‌ చేసే వారికి రైతుభరోసా ఇవ్వరనే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రులు సూచించారు. ఎవరెన్ని చెప్పినా, ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని తుమ్మల స్పష్టం చేశారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 9:36 PM IST

Rythu Bharosa Scheme Implementation
Rythu Bharosa Scheme Implementation (ETV Bharat)

Farmers Opinion on Rythu Bharosa Scheme in Karimnagar : రైతు భరోసా అమలు విధి విధానాలపై రైతుల అభిప్రాయ సేకరణకు ఏర్పాటైన కేబినెట్​ సబ్​ కమిటీ ఉమ్మడి కరీంనగర్​ జిల్లా రైతులతో ముచ్చటించింది. కరీంనగర్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుతో పాటు జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి, మంత్రులు శ్రీధర్​ బాబు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్సీ జీవన్ ​రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

గత పదేళ్ల కాలంలో రైతులకు పంటల బీమా సదుపాయం లేదని కాంగ్రెస్​ ప్రభుత్వం రైతుల వాటా కూడా చెల్లించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సూచించారు. రైతులకు మంచి చేద్దామని చూస్తుంటే బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్​ బాబు ఎద్దేవా చేశారు. ఆర్థికపరంగా ఇబ్బందులున్నా రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కేటాయించి రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. రుణమాఫీపై ఎప్పుడూ మాట్లాడని కేటీఆర్​, కేంద్రమంత్రి బండి సంజయ్​ గతంలో రైతు సమస్యలపై ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.

రైతు భరోసా, రుణమాఫీకి తేడా తెలియని వారు పదేళ్లు పరిపాలించారు : రైతు భరోసా ఏమేరకు ఇవ్వాలనే అంశం ఎలాంటి నిర్ణయాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకోలేదు. అందువల్లనే మీ వద్దకు వచ్చి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. ఇన్​కంట్యాక్స్​ ఫైల్​ చేసే రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొంతమంది గోబెల్స్​ ప్రచారం చేస్తున్నారు. రైతుభరోసా నిధులు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టారని అంటున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీకి తేడా తెలియనివారు పదేళ్ల పాటు ఎలా పాలించారో అర్థం కావడం లేదు. కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్​ కార్డు ప్రస్తావన తీసుకువస్తే రేషన్​ కార్డు ఉన్న వాళ్లకు ఇస్తారని దుష్ప్రచారం చేశారు. అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ధ్వజమెత్తారు.

రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ : గత ప్రభుత్వం రైతుల పేరిట రూ.25 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రతి పైసా నిజమైన లబ్ధిదారులకు అందించాలన్న ఉద్దేశ్యంతోనే కసరత్తు చేస్తోందన్నారు. కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని మంత్రి శ్రీధర్​ బాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వారికి ఎలా ఇస్తే బాగుంటుందో రైతుల అభిప్రాయం కోసం ఫామ్​లు ఇచ్చారని ఆలస్యమైనా ఫర్వాలేదు రైతులు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించారు. రైతులు పంటబీమా ఇవ్వాలని అడుగుతున్నారని, తప్పకుండా రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించి పరిహారం అందేలా చూస్తామన్నారు.

అన్ని వర్గాల సూచనలు, అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే రైతు భరోసా : మంత్రివర్గ ఉపసంఘం - Rythu Bharosa Workshop in telangana

రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ ప్రక్రియలో మంత్రులు కూడా భాగస్వాములు కావాలి : భట్టి - Deputy CM Bhatti on Annual Budget

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.