ETV Bharat / state

అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన రామోజీ గ్రూప్ - Ramoji Rao Memorial Meet - RAMOJI RAO MEMORIAL MEET

Ramoji Rao Memorial Meet in Vijayawada : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న రామోజీరావు చిత్రపటానికి వారు పుష్పాంజలి ఘటించారు. అనంతరం అమరావతి కోసం రామోజీ గ్రూప్ తరపున కుటుంబ సభ్యులు రూ.10 కోట్లు విరాళం అందజేశారు.

Family Members Attend Ramoji Rao Memorial Service
అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన రామోజీ గ్రూప్ సంస్థలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 6:51 PM IST

Updated : Jun 27, 2024, 10:23 PM IST

Family Members Attend Ramoji Rao Memorial Service : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు రామోజీరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ క్రమంలోనే అమరావతి కోసం రామోజీ గ్రూప్ రూ.10 కోట్లు విరాళం అందించింది. ఈ మేరకు రామోజీ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు విరాళం చెక్కు అందించారు. నాన్నగారి సంస్మరణ సభకు హాజరైన అందరికీ నమస్సులు అని కిరణ్ తెలిపారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును నాన్నగారే సూచించారని, దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి ఎదగాలని నాన్నగారు ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు.

kiran Speech in Ramoji Rao Memorial Meet : ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని కిరణ్ పేర్కొన్నారు. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని చెప్పారు. ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని తమ కుటుంబ సభ్యులు, తన తరఫున సభా ముఖంగా మాటిస్తున్నట్లు కిరణ్ ప్రకటించారు.

"నాన్నగారి సంస్మరణ సభ నిర్వహించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ పరితపించేవారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలబడేవారు. ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారు. దేశం నలుమూలలా బాధితులకు అండగా నిలబడ్డారు. నాన్నగారి స్ఫూర్తితో ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నాం." - కిరణ్‌, ఈనాడు ఎండీ

కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడుతో పాటు ఈటీవీ ప్రసారాలతో మీడియాలో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల వెన్నంటి నిలిచారు. మార్గదర్శితో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా అందించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చోటు దక్కించుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ - హాజరైన ప్రముఖులు - Ramoji Rao Memorial Program

రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న కుటుంబ సభ్యులు (ETV Bharat)

Last Updated : Jun 27, 2024, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.