ETV Bharat / state

"త్వరపడండి!" మద్యం టెండర్లకు రేపే లాస్ట్ - గ్రామీణ దుకాణాలకు తక్కువ దరఖాస్తులు!

కొత్త మద్యం పాలసీతో వ్యాపారుల్లో కిక్కు- రేపటితో దరఖాస్తుల గడువు క్లోస్​

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

ap_liquor_policy
ap_liquor_policy (ETV Bharat)

Excise Deputy Commissioner About Liquor Shop Tenders : కొత్త మద్యం పాలసీ రాష్ట్రంలోని వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో ఒక్క వైన్ షాప్ దక్కినా చాలనే భావనతో మద్యం టెండర్ల దరఖాస్తులకు క్యూ కడుతున్నారు. ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వేలం పాటకు కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు దాఖలుకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో జిల్లాల్లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వ్యాపార వాంఛ, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తులు రాయబారాలు జరుపుతున్న ఘటనలు అనేకం.

మద్యం దుకాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కొన్ని చోట్ల దరఖాస్తులు చేసుకోనీయకుండా స్థానిక నేతల అనుచరులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 11న మద్యం దుకాణాలకు వేలంపాట నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక్కరినే వేలంపాటకు ఆహ్వానిస్తామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయని ఉమ్మడి కృష్ణా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు చెబుతున్నారు.

లిక్కర్ లక్కు ఎవరికో! - మద్యం షాపుతో జాతకం మారేనా? - రాయబారాలు ఫలించేనా!

సోమవారం రాత్రి 9 గంటల వరకూ 20,310 దరఖాస్తులు అందాయి. వీటిలో సోమవారం నాడే 12,036 అర్జీలు వచ్చాయి. మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏడు రోజుల వ్యవధిలో ఈ దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో దుకాణానికి ఆరు చొప్పున అర్జీలు పడ్డాయి. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో సర్కార్​కి రూ.406.20 కోట్ల ఆదాయం సమకూరింది. రేపటితో అర్జీలకు గడువు ముగియడంతో నేడు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని అధికారులు తెలుపుతున్నారు.

మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే - AP liquor shops application process

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.