Excise Department Notification for Bar Licenses in AP: రాష్ట్రవ్యాప్తంగా 53 బార్ లైసెన్సుల జారీకి అబ్కారీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏడాది కాలపరిమితితో ఉన్న లైసెన్సులకు నోటిఫికేషన్ ఇస్తున్నట్లు అబ్కారీ శాఖ తెలిపింది. 2024 డిసెంబరు 1 నుంచి 2025 ఆగస్టు 31 తేదీ వరకూ 53 బార్ల లైసెన్సులకు వేలం వేయనుంది. ఈ-వేలం, ఆన్ లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించనుంది.
ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమై 22వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుంది. 50 వేల జనాభా వరకూ రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము ఉంటుందని 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా వరకూ ఉన్న ప్రాంతాలకు రూ.7.5 లక్షల దరఖాస్తు రుసుము ఉంటుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇంక 5 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.10 లక్షల దరఖాస్తు రుసుము నిర్ధారించినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.
ప్రొవిజినల్ లైసెన్సులు జారీ: రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల ఏర్పాటు కోసం ఇటీవలే ఎక్సైజ్ శాఖ ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేసింది. ఈ క్రమంలో పలుచోట్ల దుకాణాలు ప్రారంభమయ్యాయి. అవి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా లేదా అని పరిశీలించి ఎక్సైజ్ అధికారులు రెగ్యులర్ లైసెన్సులు జారీ చేశారు.
తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు: మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని ప్రభుత్వం తెలిపింది. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే రూ.5 లక్షలు ఫైన్ వేయాలని చెప్పింది. ఆ తర్వాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను బెల్ట్ షాపులను అనుమతించవద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించింది. బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే రూ.5 లక్షలు అపరాధ రుసుము విధించాలని పేర్కొంది. మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని వివరించింది.
మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వార్నింగ్ - ఎక్కువ ధరకు విక్రయిస్తే