ETV Bharat / state

అలర్ట్​ - ముగియనున్న మద్యం షాపుల దరఖాస్తుల గడువు - 1300 కోట్లు దాటిన ఆదాయం - EXCISE COMMISSIONER ON APPLICATIONS

ఇప్పటివరకు 3396 మద్యం దుకాణాలకు 65,424 దరఖాస్తులు - రూ. 1308 కోట్ల ఆదాయం

excise_commissioner_on_applications
excise_commissioner_on_applications (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 3:30 PM IST

Updated : Oct 11, 2024, 4:31 PM IST

Excise Commissioner on Liquor Shop Applications: ఈ రోజు సాయంత్రం 7 గంటలతో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. సాయంత్రం 7 గంటల వరకే ఆన్ లైన్​లో నూతన రిజిస్ట్రేషన్​కు అవకాశం ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు రాత్రి 12 గంటలలోపు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. బ్యాంకు డీడీలతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో దరఖాస్తులు సమర్పించేవారు సాయంత్రం 7 గంటలలోపు క్యూ లైన్​లో ఉంటేనే అవకాశం ఉంటుందని వివరించారు.

దరఖాస్తు పత్రాలతో 7 గంటలలోపు ఎక్సైజ్ స్టేషన్ల వద్ద క్యూలైన్లలో ఉన్నవారికి టోకెన్లు అందించి దరఖాస్తుల స్వీకరిస్తామని నిషాంత్ కుమార్ అన్నారు. దరఖాస్తు దారులు నిబంధనలు పాటించి కార్యక్రమం సజావుగా ముగిసేలా సహకరించాలని కోరారు. 3396 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకూ 65,424 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మద్యం దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 1308 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ కమీషనర్ నిషాంత్‌ కుమార్‌ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం తుది గడువు కావటంతో 20 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం దరఖాస్తుల సంఖ్య 80 వేలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు.

"ఇదేందయ్యా ఇదీ!" ఆ దుకాణాలకు ఒక్కటే దరఖాస్తు - మద్యం టెండర్లలో రింగ్ ?

అప్పుల్లో ఆంధ్ర టాప్​ - గ్రామీణ మహిళలే ముందంజ - అది ఎలాగంటే?

Last Updated : Oct 11, 2024, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.