EX Minister Jagadish Reddy Interview : కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతోనే కృష్ణా జలాలపై హక్కులు కోల్పోయామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy) మండిపడ్డారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం మంగళవారం రోజున నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో నల్గొండ(Chalo Nalgonda) కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం ఎంతకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య వంటిదన్న జగదీశ్‌రెడ్డితో ఇంటర్వూ.
ప్రశ్న : నల్గొండలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు నిర్వహిస్తున్నారు?
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కాపాడుకోవడం కోసం ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేఆర్ఎంబీ(KRMB) చేతికి ప్రాజెక్టులు ఇవ్వకుండా మా ప్రభుత్వం కాపాడుకుంది. దురదృష్టవశాత్తు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనుభవలేమి, అవగాహనా రాహిత్యం, అంతర్గత ఒప్పందాలు లేదా ఇతర విషయాల వల్ల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పింది. మళ్లీ మన ప్రాజెక్ట్‌లు సాధించుకోవాలని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చాలని ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం.
కాంగ్రెస్‌కు పాలన చేతకాకపోతే కేసీఆర్‌ను అడగండి : జగదీశ్ రెడ్డి
ప్రశ్న : అధికార పార్టీ నాయకులు కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కలిసి పదేళ్లలో మనకు రావాల్సిన నీళ్లు మొత్తం ధారాదత్తం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన?
జవాబు : ఇవి తెలివి తక్కువ మాటలు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏదో ఒక ఆరోపణ చేసి తప్పించుకొందామని చేసినవి మాత్రమే. పదేళ్లగా మేము ఎలా నీళ్లు వాడుకున్నామో, పంటలు పండించామో స్పష్టంగా కనిపిస్తోంది. పైగా ఎక్కడా కేసీఆర్, జగన్‌తో మాట్లాడిన సందర్భాలు, కేఆర్ఎంబీ పత్రాలపై సంతకాలు పెట్టినట్లు కానీ ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి పదేళ్లలో ఏనాడు కేసీఆర్ తలవంచలేదు. అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన మినిట్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఏపీకీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాగార్జున సాగర్ ఆక్రమిద్దామని చూశారు. ఆనాడు కేసీఆర్(KCR) తెలంగాణ కంట్రోల్లోనే ఉంచారు.
ప్రశ్న : కేసీఆర్, హరీశ్‌రావు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నల్గొండకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రులు విమర్శలు చేస్తున్నారు. దీనికి ఎలా స్పందిస్తారు?
జవాబు : రెండు నెలల కాలంలోనే ప్రాజెక్ట్‌లను ధారాదత్తం చేశారు. గతంలో కాంగ్రెస్(Congress) హయాంలో ఉన్నప్పుడు నల్గొండలో ఎంత సాగు అయింది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత సాగు అయిందని లెక్కలు తీద్దాం. దాని ద్వారా అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లి అడిగితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి ఆరోపణలకు భయపడేది లేదు. మంగళవారం జరిగే సభలో ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తాం.
సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ : జగదీశ్ రెడ్డి
BRS Public Meeting in Nalgonda : మరోవైపు నల్గొండలో జరిగే సభకు లండన్ బీఆర్ఎస్ బృందం మద్దుతు పలికింది. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ లండన్‌లోని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో చలో నల్లగొండ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని అన్నారు. తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా పోరాటాం చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతుందని పేర్కొన్నారు.
2014 నాటికి డిస్కంల అప్పు రూ.44 వేల కోట్లు : జగదీశ్‌రెడ్డి
కృష్ణా నదీ జలాల వాడకంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది : జగదీశ్ రెడ్డి