ETV Bharat / state

నిన్న ఐఏఎస్​, ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే క్యాండేట్ - ఆగమేఘాలపై వీఆర్​ఎస్​ ఆమోదం - ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్

EX IAS officer Imtiaz joins in YSRCP: ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఇంతియాజ్‌కి కండువా కప్పి, సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఇంతియాజ్‌ పేరును సీఎం ప్రకటించారు. ఈ మేరకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తుకు సీఎం జగన్ భరోసా ఇచ్చారని తెలిపారు.

EX IAS officer Imtiaz joins in YSRCP
EX IAS officer Imtiaz joins in YSRCP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 5:37 PM IST

EX IAS officer Imtiaz joins in YSRCP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ కన్ఫర్మ్ అయిన నేతలు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో స్థానిక రాజకీయ సమీకరణలతో పాటుగా, కుల, మత సమీకరణాల ఆధారంగా పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఇంకా కసరత్తు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థి ఎవ్వరన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ (IAS officer Imtiaz)​ పేరు తెరమీదకు వచ్చింది.

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్: ఐఎఎస్​ కు స్వచ్చంద పదవీ విరమణ చేసిన ఇంతియాజ్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కండువా కప్పిన సీఎం జగన్ , పార్టీలో చేర్చుకున్నారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఇంతియాజ్ ను నియమించారు. ఈ మేరకు రీజినల్ కో ఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి ప్రకటించారు. ఈ సారి కర్నూలు నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రయత్నించినా, ఆయనకు నిరాశే ఎదురైంది.
బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు సీఎం కావాలి: ఎమ్మెల్యే పార్థసారధి

ప్రాధాన్యం ఇస్తామని సీఎం హామీ: కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్​కు మొండి చేయి చూపిన సీఎం జగన్, ఇద్దరూ కలసి ఇంతియాజ్ ను గెలిపించుకునేందుకు ముందుకు రావాలని ఆదేశించారు. తమకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఎవరూ ఊహించలేదు, కార్యకర్తలు కొందరు ఎమోషనల్ అయ్యారని, వారంతా సర్దుకుంటారని హఫీజ్ ఖాన్ తెలిపారు. ఈ సారి తాను ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయడం లేదని తెలిపారు. తనను పార్టీ పరంగా వినియోగించుకుంటారని, గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్దమేనని తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు - ప్రచారం చేయాలని శ్రేణులకు జగన్​ దిశానిర్దేశం

నిబంధనలకు మినహాయింపు: సీసీఎల్​ఏ అదనపు కమిషనర్, సెర్ఫ్ సీఈఓ ఎండీ ఇంతియాజ్ స్వచ్చంద ఉద్యోగ విరమణ దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించింది. ఆయన చేసిన దరఖాస్తును తక్షణమే ఆమోదిస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం 3 నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు నాన్ కేడర్ ఐఏఎస్​గా ఉన్న ఇంతియాజ్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తును అనుమతి ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy)నోటిఫికేషన్ జారీ చేశారు. స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసిన ఇంతియాజ్ నేడు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.

అభ్యర్థుల మార్పుపై 24 గంటల్లోనే మాట మార్చిన జగన్‌- 5నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల మార్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.