ETV Bharat / state

'డీఎన్‌ఏ పరీక్ష చేయాల్సిందే' - శాంతి మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు - ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ - Shanti Husband On Vijayasai Reddy

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 10:48 AM IST

Shanti Husband About MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ డీఎన్​ఏ టెస్టుకు రావాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మొదటి భర్త డిమాండ్‌ చేశారు. తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంపై వివాదం తీరాలని అన్నారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణల గురించి ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు.

Shanti Husband About MP Vijayasai Reddy
Shanti Husband About MP Vijayasai Reddy (ETV Bharat)

Shanti Husband About MP Vijayasai Reddy: తన భార్యకు పుట్టిన కుమారుడి విషయంలో వివాదం తీరాలంటే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్‌ డీఎన్‌ఏ టెస్టుకు రావాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతి మొదటి భర్త మదన్‌మోహన్‌ డిమాండ్‌ చేశారు. దళిత, గిరిజన, బహుజన సంఘాల నేతలతో కలిసి మదన్​మోహన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

తమ భార్య శాంతికుమారి విశాఖపట్నంలో కుమారుడికి జన్మనిచ్చిందని, ఆ సమయంలో తాను అమెరికాలో ఉన్నానని తెలిపారు. తాను వచ్చి ఆ గర్భానికి కారణమేంటని ప్రశ్నిస్తే, విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని ఓసారి, ఆయన ద్వారా ఐవీఎఫ్‌ చేయించుకుని కుమారుడికి జన్మనిచ్చానని మరోసారి చెప్పిందని అన్నారు.

విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శాంతి ప్రసవించిందని, ఆ సమయంలో ఆసుపత్రి రికార్డుల్లో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతురెడ్డి సుభాష్‌ పేరు ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై సుభాష్‌ను సంప్రదిస్తే, శాంతికి, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారని తెలిపారు. 2016లో విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటలు అవాస్తవమని మదన్​మోహన్ స్పష్టం చేశారు. కావాలంటే నిజనిర్ధారణ పరీక్షలకు పంపించవచ్చని, తమ ఇద్దరికి ఇప్పటికే కవల ఆడపిల్లలు ఉన్నారని శాంతి మొదటి భర్త మదన్‌మోహన్‌ తెలిపారు.

భూదందాల కోసం అడ్డుపెట్టుకున్నారు: ఎంపీ విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డి పథకం ప్రకారం దేవాదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ శాంతిని లోబరుచుని విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన దేవాదాయ భూములను ఆక్రమించుకున్నారని దళిత, గిరిజన, బహుజన సంఘాల నేతలు ఆరోపించారు. శాంతిని అడ్డుపెట్టుకుని భూ దందాలు చేసిన విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై ప్రభుత్వం కేసులు నమోదుచేయాలని, అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ జాతీయ నేత మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు.

A2 నుంచి A1 కథేంటి? ట్విటర్ బాబాయ్‌ కాస్త ట్విటర్‌ తాతయ్య ఎలా అయ్యారు? - MINISTER ANAM FIRE ON VIJAYA SAI

MP VIJAYASAI REDDY ON TWEET: తనపై వస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కుమార్తెగానే భావించా: శాంతి కళింగిరిని 2020 సంవత్సరంలో ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్​గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్​లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కుమార్తెగానే భావించానని తెలిపారు. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశానన్నారు. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించానని, తాడేపల్లిలోని ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించానని స్పష్టం చేశారు. ఏ పరాయి మహిళతోను అనైతిక సంబంధాలు లేవని, ఇదే విషయాన్ని తాను నమ్మిన దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో సైతం చెప్తానని విజయసాయి రెడ్డి అన్నారు.

సస్పెండైన దేవదాయశాఖ ఉద్యోగి శాంతి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది : మంత్రి ఆనం - Minister Anam comments on Shanti

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.