Emergency Flight Landing Trail Run on National Highway: బాపట్ల జిల్లా కొరిశాపాడు మండలం పిచ్చికలగడిపాడు వద్ద ఎమర్జెన్సీ రన్‌వేపై ట్రయల్‌రన్ నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. గతేడాది రన్‌వేపైకి దిగకుండా విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించగా, నేడు రన్‌వేపై విమానాలు దించి ట్రయల్ రన్ నిర్వహించారు.
16వ నెంబర్ జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ రన్‌వేను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయిల్ రన్ నిర్వహించారు. 16వ నంబరు జాతీయ రహదారిపై కొరిశపాడు వంతెన నుంచి జే పంగులూరు మండలం రేణింగవరం వరకు 5.1 కి. మీ. మేర ఈ రన్‌వేను నిర్మించారు. రన్‌వేపైకి ఇతరులెవరూ రాకుండా బారికేడ్లు కట్టారు. రాడార్ వాహనంతో పాటు అత్యాధునిక సాంకేతిక వాహనాలను రన్‌వే సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆశ్రమంలో ఉంచారు.
జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
గత ఏడాది రన్ వేపైకి దిగకుండా ట్రయల్ రన్: గత ఏడాది రన్ వేపైకి దిగకుండా కార్గో విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. గత ఏడాది చేసిన విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన నాలుగు విమానాలు రన్‌వే మీదుగా ప్రయాణించి, కాస్త ఎత్తు నుంచే టేకాఫ్ అయ్యాయి.
ఆ సమయంలో రన్‌వేపై విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయో లేదో అని పరీక్షించారు. గత ఏడాది తాత్కాలిక రాడార్ సాంకేతికతంగా సహకరిస్తుందో లేదో అని కూడా పరిశీలించారు. విమానాలు భూమిపై పూర్తిగా ల్యాండ్ అవకుండా కొన్ని మీటర్ల ఎత్తులో ప్రయాణించాయి. రన్‌వే విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు పూర్తి అనువుగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
కాలేజీ గ్రౌండ్లో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్- స్టూడెంట్స్ అరుపులు, లైవ్ వీడియో చూశారా?
ప్రస్తుతం రన్‌వేపైన విమానాలు ల్యాండింగ్: తాజాగా రన్ వేపైన విమానాలు ల్యాండింగ్ చేసి పరిశీలించారు. దీంతో సుకోయ్ 30, జెట్ ఫైటర్ హాక్ కార్గో విమానాలు ఎఎన్ 32, డోర్నియర్ విమానం రన్ వే పైకి వచ్చాయి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది.
ఎందుకోసమంటే: యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో అత్యవసర సేవలతోపాటు, సైనిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ రన్‌వేను నిర్మించారు. దీని నిర్మాణం కోసం కేంద్రం 80 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2018లో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రన్‌వే నిర్మాణాలకు ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి 20 రన్‌వేలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది.
జాబిల్లిపై దిగిన తొలి అమెరికా ప్రైవేట్ ల్యాండర్- కానీ సిగ్నల్స్ మాత్రం వీక్!