AP Couple Stuck in Saudi : ఉపాధి నిమిత్తం ఏపీకి చెందిన ఓ దంపతులు సౌదీకి వెళ్లి అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ విషయాన్ని భర్త విలపిస్తూ బంధులకు వీడియోను షేర్ చేశాడు. అంతే కాక తన భార్యను ఇక్కడ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన పాస్‌పోర్టు లాక్కుని బయటకు తోసేశారని తెలిపాడు. జీతం అడుగుతుంటే కొడుతున్నారని, తిండి తిప్పలు లేకుండా మండిపోతున్న ఎండల్లో కార్ల నీడలో కాలం గడుపుతున్నాని వాపోయాడు. కేవలం నీళ్లు తాగి బతుకుతున్నా, ఆకలితో చనిపోయేలా ఉన్నా కాపాడండని చెప్పాడు. తన భార్యను కూడా ఉద్యోగం పేరిట తీసుకువెళ్లారని, ఆమె ఆచూకీ తెలియడం లేదని వివరించాడు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానని ఏలూరుకు చెందిన జుబేర్ సౌదీలోని రియాద్ నుంచి ఈ వీడియోను బంధువులకు పంపించాడు.
Eluru Person Tortured in Saudi : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఏలూరుకు చెందిన జుబేర్, మెహరున్నీసాలు దంపతులు. వీరికి షేక్ పర్హానా (8), షేక్ షెహనాజ్ (6) ఇద్దరు ఆడపిల్లలు. కరోనా లాక్‌డౌన్‌కు ముందు జుబేర్ సౌదీలోని రియాద్ నగరంలో డ్రైవర్‌గా పని చేశాడు. కొవిడ్ సమయంలో భారత్‌కు వచ్చాడు. తాజాగా ఉద్యోగం ఉందనడంతో 9 నెలల కిందట మళ్లీ అక్కడకి వెళ్లాడు. అక్కడ జుబేర్ పాస్‌పోర్ట్‌ను తీసుకుని ఉద్యోగం ఇచ్చారు.
భార్యకు కూడా ఉద్యోగం ఉందనడంతో జుబేర్ మెహరున్నీసాను అక్కడి పిలిపించాడు. ఆమెను ఉద్యోగం కోసం మస్కట్ దేశానికి పంపారు. వారానికి ఒక రోజు మాత్రమే ఫోన్‌లో మాట్లాడనిచ్చేవారని బాధితుడు చెబుతున్నాడు. జీతం ఇవ్వమని అడగడంతో, అతని పాస్‌పోర్టు లాక్కుని జీతం ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టారని వాపోయాడు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి 13 రోజులుగా రోడ్లపైనే తిరుగుతున్నట్లు, నీళ్లు మాత్రమే తాగుతూ కాలం గడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నానని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
ఈ విషయాన్ని రియాద్ నగరం నుంచి జుబేర్ వీడియో కాల్ ద్వారా విజయవాడ, న్యూరాజరాజేశ్వరీపేటలోని తెలిసిన వారికి వీడియో కాల్ చేసి తన పరిస్థితిని జుబేర్ వివరించాడు. తన భార్య పరిస్థితి బాగాలేదని, ఓ మహిళకు రూ.లక్ష కట్టి ఉద్యోగం కోసం వచ్చిందని తెలిపాడు. మస్కట్‌లో పని ఉందని తీసుకువెళ్లారని, అటుఇటూ తిప్పుతున్నారని పేర్కొన్నాడు. సరిగా అన్నం కూడా పెట్టటం లేదని, జీతం ఇవ్వడం లేదని జుబేర్ వీడియో కాల్‌లో వివరించాడు. తన భార్యను తిడుతున్నారని, కొడుతున్నారని తమను భారత్‌కు తీసుకురావాలంటూ కంటతడి పెట్టుకున్నాడు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండయ్యా! : కుమారుడు పరిస్థితి గురించి తెలుసుకున్న తల్లి సలీమున్నీసా శనివారం సాయంత్రం విజయవాడకు వచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరాను కలిశారు. తన కుమారుడు 13 రోజులుగా రోడ్లపైనే తిరుగుతున్నాడని, నోటి వెంట రక్తం కక్కుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కోడలు ఎక్కడ ఉందో, ఏం పని చేయిస్తున్నారో చెప్పడం లేదంటూ వాపోయారు. ఇద్దరు మనవరాళ్లు తల్లిదండ్రుల కోసం విలపిస్తున్నారంటూ ఆమె రోదిస్తూ ఉమాకు వివరించారు. సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి కుమారుడిని, కోడలిని విదేశాల నుంచి ప్రాణాలతో తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేశారు. వారికి న్యాయం చేస్తానంటూ బొండా ఉమా హామీ ఇచ్చారు.
మరోసారి మంచిమనసు చాటుకున్న మంత్రి లోకేశ్ - ఓమన్‌లో చిక్కుకున్న మహిళకు భరోసా